త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Chief Ramchandar Rao | రేవంత్.. ముందు కేర‌ళంలో సీట్లు త‌గ్గించ‌మ‌ని అడుగు: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

BJP Chief Ramchandar Rao | డీలిమిటేషన్‌(Delimitation)పై సీఎం రేవంత్ రెడ్డి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు (BJP chief Ramchandar Rao) విమ‌ర్శించారు. గురువారం హైద‌రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయ‌న‌ మాట్లాడారు. కేరళం కంటే తెలంగాణ జనాభా ఎక్కువని, కేరళంలో 20 ఎంపీ సీట్లుంటే తెలంగాణలో 17 మాత్రమే ఉన్నాయన్నారు.

S

News | Published On Apr 16, 2026, 3.05 pm IST

BJP Chief Ramchandar Rao | రేవంత్.. ముందు కేర‌ళంలో సీట్లు త‌గ్గించ‌మ‌ని అడుగు: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: డీలిమిటేషన్‌(Delimitation)పై సీఎం రేవంత్ రెడ్డి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు (BJP chief Ramchandar Rao) విమ‌ర్శించారు. గురువారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. కేరళం కంటే తెలంగాణ జనాభా ఎక్కువని, కేరళంలో 20 ఎంపీ సీట్లుంటే తెలంగాణలో 17 మాత్రమే ఉన్నాయన్నారు. ముందు కేరళంలో సీట్లు తగ్గింపున‌కు రేవంత్ య‌త్నించాల‌ని సూచించారు. డీలిమిటేష‌న్‌పై దక్షిణ‌, ఉత్తర‌ అని రేవంత్ వైషమ్యాలు సృష్టించడం త‌గ‌ద‌న్నారు.

గ‌తంలోనే త‌గ్గాయి...

దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ‌తోనే జనాభా తగ్గింద‌ని.. ఉత్తరంలో అలా పాటించ‌లేద‌ని రాహుల్ గాంధీ, రేవంత్ వితండవాదం చేస్తున్నారని మండిప‌డ్డారు. జీఎస్‌డీపీ ప్రకారం సీట్లు పెంచమనడం స‌రికాద‌న్నారు. రాహుల్‌కు మించి రేవంత్‌ జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారని ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్‌ను ముందే స్టాలిన్ వ్య‌తిరేకించార‌ని గుర్తు చేశారు. తెలంగాణలో 50 శాతం సీట్లు పెరిగితే ఉత్తర‌ప్ర‌దేశ్‌లో 50 శాతం పెరుగుతాయని చెప్పారు. ఇక‌ దక్షిణాదిలో గ‌తంలోనే సీట్లు తగ్గాయ‌ని, ఇప్పుడు తగ్గుతున్నట్లు రేవంత్ తప్పుడు ప్రచారం చేయ‌డం ఆయ‌న అవివేకానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చేయాలనే ప్ర‌ణాళిక చేస్తున్న‌ట్లు ఆరోపించారు.

డీలిమిటేష‌న్‌ను రాహుల్ కోరారు..

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చేయాలని రాహుల్ కొత్త పార్లమెంట్ భవనంలోనే కోరిన విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ నేత‌లు అడుగుతున్నార‌ని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనాభా ఉన్న రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఇచ్చారని రాంచంద‌ర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన‌ కుల గణన సక్రమంగా కాలేదని, మా గల్లీలోకీ ఎన్యూమరేటర్‌ రాలేదని విమ‌ర్శించారు.

ఉత్తరాదిలో కాంగ్రెస్ లేదని, దక్షిణాదిలోనూ తుడిచిపెట్టుకుపోతుంద‌న్నారు. దక్షిణాదిలో కాంగ్రెస్ కంటే భాజపాకే ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయ‌ని తెలిపారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే రేవంత్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ ఎన్నికల తర్వాత పెడితే యూపీ ఎన్నికలంట‌రు.. ఆ తర్వాత పెడితే తెలంగాణ ఎన్నికలంట‌రు అనంత‌రం ఇంకేదో అంట‌రు అని దుయ్య‌బ‌ట్టారు. అందుకే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ మంచిద‌ని రామచందర్‌ రావు అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement
Advertisement