త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ప్లీజ్‌..ప్లీజ్ మీ కాళ్లు ప‌ట్టుకుంటా. నాపై కేసులు పెట్ట‌కండి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప, ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు. అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని జబ్బలు చర్చుకున్నారు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు. మరి ఈ బడ్జెట్‌లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత, గిరిజన బిడ్డలకి 12 లక్షలు ఇస్తామనేది ఏదైతే మాట చెప్పారో, ఆ మాట నిలబెట్టుకుంటారా

a

News | Published On Feb 2, 2026, 5.00 am IST

ప్లీజ్‌..ప్లీజ్ మీ కాళ్లు ప‌ట్టుకుంటా. నాపై కేసులు పెట్ట‌కండి
Advertisement

ప్లీజ్‌..ప్లీజ్ మీ కాళ్లు ప‌ట్టుకుంటా. నాపై కేసులు పెట్ట‌కండి

నీపై కేసులు పెట్ట‌కుండా
ఢిల్లీకి ట్రిప్పులే ట్రిప్పులు
ఇప్ప‌టివ‌ర‌కు 50-60 ట్రిప్పులు కొట్టిన‌ట్టున్నారు
ఢిల్లీకి వెళ్లి ..ప‌గ‌లు అధిష్టానానికి మూట‌లు
రాత్రి పూట బీజేపీ పెద్ద‌ల కాళ్లు ప‌ట్టుకోవ‌డాలు
గాలి మాటలు, గాలిలో విహారాలు, సిట్ల పేరిట కాలక్షేపాలు
ఇదే మీకు తెలిసింది...
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

త్రినేత్ర‌.న్యూస్ : 'నీకు వేరే ప‌నిలేదు. వారానికో సారి ఢిల్లీకి ట్రిప్పు కొడుతున్నావు. మీ కాంగ్రెస్ పెద్ద‌ల‌కు మూట‌లు స‌మ‌ర్పించుకుంటున్నావు. ప‌గ‌లేమో కాంగ్రెస్ పెద్ద‌ల‌తో భేటీలు. రాత్రేమో బీజేపీ పెద్ద‌ల కాళ్లు ప‌ట్టుకోవ‌డాలు. ఇంతేక‌దా నువ్వు ఈ రెండేండ్ల‌లో చేస్తూ వ‌స్తున్న‌ది ..అంటూ ముఖ్య‌మంత్రి రేవ‌త్ రెడ్డిపై బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

👉🏿 ఈరోజు నిజానికి ఫిబ్రవరి ఒకటవ తేదీ. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నే ప్రవేశపెడతారు. అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు... ఎందుకంటే వీళ్ళకు తెలుసు, 8 + 8 = 0 అనేది కాంగ్రెస్ బిజెపికి తెలుసు. ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్‌కు ఉన్నా, ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నా, తెలంగాణకు గత రెండు బడ్జెట్లలో దక్కింది సున్నా, ఈ బడ్జెట్లో కూడా దక్కేది సున్నా అనేది స్పష్టంగా తెలుసు

👉🏿 కాబట్టే ఇవాళ కేవలం ఆ అంశం మీదికి, వీళ్ళ వైఫల్యం మీదికి, వీళ్ళ చేతకానితనం మీదికి, కేంద్రంతో పోరాడి నిధులు తేలేని తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈ రోజు ఇక్కడ కెసిఆర్ గారికి ఒక ఆదివారం పూట, అది కూడా విచారణ అని చెప్పి వారు వెంటబడ్డారు.

👉🏿 ఒకవైపు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే, కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విదిల్చకపోతే, బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉండాలా? ఏం చేయాలి ఈరోజు? మంత్రులేమో కెసిఆర్ గారిని తిడుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు విదేశాల్లో విహారయాత్రలు.

👉🏿 ఇది కలిపి ఒక 35 వేల కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తా ఉన్నారు. 42 శాతం వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులో అన్నారు. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప, ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు. అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని జబ్బలు చర్చుకున్నారు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు. మరి ఈ బడ్జెట్‌లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత, గిరిజన బిడ్డలకి 12 లక్షలు ఇస్తామనేది ఏదైతే మాట చెప్పారో, ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి రాష్ట్రంలోని దళిత గిరిజన సోదరులు మీ వైపు చూస్తున్నారు. మైనారిటీలోకి సబ్ ప్లాన్ అన్నారు, మరి మైనారిటీ సబ్ ప్లాన్ ఏమన్నా పెడతారా? మైనారిటీలకు కనీసం ఏదైనా న్యాయం చేస్తారా? మైనారిటీ సోదరులు చూస్తా ఉన్నారు. అట్లాగే విద్యా భరోసా కార్డు అన్నారు 5 లక్షలు, మా విద్యార్థులు చూస్తా ఉన్నారు మీ వైపు. మీ 420 హామీలు, మీ ఆరు గ్యారెంటీలు, ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు మహాలక్ష్మి నెలకు రెండున్నర వేలు ఎప్పుడు వస్తాయని.

👉🏿 ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటే మీరు గాలి మాటలు, గాలిలో విహారాలు, సిట్ల పేరిట కాలక్షేపాలు బంద్ చేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టండి. రాష్ట్ర ప్రజలకిచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు, వాటి అమలును ఎప్పటినుంచి మొదలుపెడతారు, ఈ బడ్జెట్‌లో ఎన్ని కేటాయింపులు చేస్తారు? మేము మాత్రం మిమ్మల్ని వదలకుండా రాష్ట్ర ప్రజల తరపున వెంబడపడతాం, తప్పకుండా ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం.

👉🏿 మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతాం. ఒక్కొక్క రైతుకు మీరు 80 వేల రూపాయలు బాకీ పడ్డారు. ఒక్కొక్క పెద్ద మనిషికి, ఒక పెద్ద వయసులో ఉండే అవ్వకు తాతకు మీరు 52 వేల రూపాయలు బాకీ ఉన్నారు 26 నెలలకి గాను, నెలకు 2 వేల చొప్పున. అట్లాగే రైతులకు, మహిళలకు రెండున్నర వేల చొప్పున 60 వేలు బాకీ ఉన్నారు ప్రతి మహిళకు రాష్ట్రంలో. ఇవన్నీ కూడా చెబుతాము.

👉🏿 బడ్జెట్‌లో తప్పకుండా మీరు ఇవాళ కేంద్రం నుంచి సాధించలేని నిధులు... 60 సార్లు పోయి వచ్చారు కదా, వారానికి ఒకసారి గాలి మోటార్లో పోయి వచ్చారు కదా చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని మరి, ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా, ఎవరి అబ్బ సొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? తెలంగాణ ప్రజల సొత్తు కాదా? మీ సోకుల కోసం, మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం ఏదైతే ఉందో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement