Shruti Haasan | పెద్ది స్పెషల్ సాంగ్ కోసం.. శృతి హాసన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..!
Shruti Haasan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్ కనిపించనుంది. ఈ పాటకు ఆమె భారీగా రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
Entertainment | Published On Apr 29, 2026, 1.53 pm IST
Shruti Haasan | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. తాజాగా స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ పాట కోసం మొదట పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. చివరి ఆ ఛాన్స్‌ను కోలీవుడ్ స్టార్ శృతి హాసన్‌కు దక్కింది. ఈ సాంగ్‌లో ఆమె రామ్ చరణ్‌తో కలిసి అదిరే స్టెప్పులతో అలరించనుంది. ప్రస్తుతం జన్వాడలో ఈ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఇందు కోసం స్పెషల్‌గా భారీ సెట్ వేసి షూటింగ్ జరుపుతుండగా.. చరణ్ - శృతి రిహార్సల్స్ చేస్తున్నారు. ఎవరో టాప్ యాంగిల్ నుంచి సీక్రెట్‌గా మొబైల్‌లో రికార్డు చేసి లీక్ చేశారు. కేవలం కొద్ది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో కొద్ది సమయంలో వైరల్ అయ్యింది. ఈ సాంగ్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సాంగ్ కోసం శృతి హాసన్ తీసుకుంటున్న పారితోషకం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. స్పెషల్ సాంగ్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది. సమాచారం మేరకు.. ఈ సాంగ్ కోసం రూ.5కోట్లు చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా స్పెషల్ సాంగ్‌లకు ఇచ్చే పారితోషికంతో పోలిస్తే చాలా ఎక్కువ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి శృతి హాసన్ రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల మధ్యలోనే తీసుకుంటుందనే మరో వార్త ప్రచారంలో ఉంది. ఈ రెండింటిలో ఏది నిజమో స్పష్టత లేదు. ఒకే పాట కోసం ఇంత భారీ మొత్తంలో పారితోషికం చెల్లిస్తున్నారనే వార్తతో ఈ స్పెషల్ సాంగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందా? లేక అంచనాలను మించిపోతుందా? అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్, చికిరి, రాయ్ రాయ్ రా రా, పహిల్వాన్ వీడియో భారీ బజ్ వచ్చింది. ఈ మూవీకి రెహమాన్ సంగీతం అందిస్తుండడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ‘పెద్ది’ విడుదల కాబోతోంది. ‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను స్క్రీన్‌పై ఎలా చూపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



