త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakul Preet Singh | ఐదేళ్ల త‌ర్వాత తెలుగు సినిమాలో ర‌కుల్

ఐదేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఓ తెలుగు సినిమాలో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. క్రిష్ కొండ‌పొలం త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైన ర‌కుల్ ప్రీత్‌సింగ్‌...తిరిగి అదే డైరెక్ట‌ర్ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

N

News | Published On Apr 2, 2026, 5.19 pm IST

Rakul Preet Singh | ఐదేళ్ల త‌ర్వాత తెలుగు సినిమాలో ర‌కుల్
Advertisement

Rakul Preet Singh |  ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ను తెలుగు ప్రేక్ష‌కులు దాదాపు మ‌ర్చిపోయారు. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమా వ‌స్తుందంటే క‌థానాయిక‌గా తొలుత ఈ ఢిల్లీ బ్యూటీ పేరు వినిపించేది. తెలుగులో మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు అగ్ర హీరోలంద‌రితో ఆడిపాడింది. కానీ విజ‌యం మాత్రం ర‌కుల్ ప్రీత్‌తో దోబూచులాడింది. కెరీర్ ఆరంభంలో ఒక‌టి రెండు స‌క్సెస్‌లు ద‌క్కినా...ఆ త‌ర్వాత అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు.

ఐదేళ్లు దాటిపోయింది...

ర‌కుల్ తెలుగు సినిమా చేసి ఐదేళ్లు దాటిపోయింది. చివ‌ర‌గా వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా క్రిష్ డైరెక్ష‌న్‌లో రూపొందిన‌ కొండ‌పొలంలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ డిజాస్ట‌ర్‌తో ర‌కుల్‌కు టాలీవుడ్‌లో ఒక్క అవ‌కాశం రాలేదు. దాంతో బాలీవుడ్‌కు షిప్ట‌య్యింది.

క్రిష్ సినిమాతోనే...

లాంగ్ గ్యాప్ త‌ర్వాత తిరిగి డైరెక్ట‌ర్ క్రిష్ సినిమాతోనే ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఏడాది రిలీజైన అనుష్క ఘాటి త‌ర్వాత ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కిస్తున్నాడు. ట్రెక్కింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నున్న ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ట‌. ఇందులో ఓ హీరోయిన్‌ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ కోసం ర‌కుల్ ట్రెక్కింగ్‌లో స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుంద‌ట‌.ఫిమేల్ సెంట్రిక్‌గ్‌గా ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం.
ఉగాది సంద‌ర్భంగా గ‌త నెల‌లో సైలెంట్‌గా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం డార్జిలింగ్‌లో క్రిష్ మూవీ షూటింగ్ జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌కుల్ ఈ అడ్వెంచ‌ర్ మూవీ షూటింగ్‌లో జాయిన్ కానున్న‌ట్లు స‌మాచారం.

బాలీవుడ్ సినిమాలో....

ప్ర‌స్తుతం హిందీలో ప‌తి ప‌త్నీ ఔర్ వో దో సినిమా చేస్తోంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు భూమి ఫ‌డ్నేక‌ర్‌, అన‌న్య పాండే హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

Advertisement
Advertisement