త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PRC, Pending bills | జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు చేయాలి: జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, వొడ్నాల రాజశేఖర్

Representation letters | వ‌చ్చే జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ (PRC) అమలు చేయాలని.. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగులంద‌రికీ పెండింగ్ బిల్లులు (Pending bills) చెల్లించాల‌ని తెలంగాణ ఎంప్లాయీస్ టీచ‌ర్స్ అండ్ పెన్ష‌న‌ర్స్‌ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి (JAC Chairman Lachhi Reddy), సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ (Vodnala Rajashekar) డిమాండ్ చేశారు. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు.

S

News | Published On Apr 17, 2026, 2.51 pm IST

PRC, Pending bills | జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు చేయాలి: జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, వొడ్నాల రాజశేఖర్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వ‌చ్చే జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ (PRC) అమలు చేయాలని.. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగులంద‌రికీ పెండింగ్ బిల్లులు (Pending bills) చెల్లించాల‌ని తెలంగాణ ఎంప్లాయీస్ టీచ‌ర్స్ అండ్ పెన్ష‌న‌ర్స్‌ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి (JAC Chairman Lachhi Reddy), సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ (Vodnala Rajashekar) డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులనూ వెంటనే అమలు చేయాల‌ని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాల‌న్నారు. ఈమేరకు దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే లక్ష్యంగా రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని మండ‌ల, డివిజ‌న్ కేంద్రాల్లో విన‌తిప‌త్రాల (Representation letters) స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. శుక్ర‌వారం లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణ మొద‌లు పెట్టిన‌ట్లు చెప్పారు. 2004, సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాల‌న్నారు. పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాల‌ని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement