RS Praveen Kumar | పొంగులేటి.. దమ్ముంటే డాక్యుమెంట్లతో రా.. చర్చిద్దాం: ఆర్ఎస్పీ సవాల్
RS Praveen Kumar | కాంగ్రెస్ ముమ్మాటికీ భూ ఆక్రమణల ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి లక్షల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. పొంగులేటికి దమ్ముంటే డాక్యూమెంట్లతో రావాలని.. ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ముమ్మాటికీ భూ ఆక్రమణల ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి లక్షల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. పొంగులేటికి దమ్ముంటే డాక్యూమెంట్లతో రావాలని.. ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియా(Press meet)తో మాట్లాడారు. భూ దోపిడీని అడ్డుకునేందుకు పరిగి వెళ్తున్న హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
సీఎం హోంమంత్రి శాఖను తన చంకలో పెట్టుకోవడం, పొంగులేటి దగ్గర రెవెన్యు, సమాచార శాఖలు పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. నాదర్ గుల్ భూములపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఏక్యూ స్క్వేర్ మనుషులు నీళ్లు నమిలారని ఎద్దేవా చేశారు. నిన్న ఆదిలాబాద్ లో ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పిన సీఎం రేవంత్ 24 గంటల్లోనే దాన్ని ఉల్లంఘించారన్నారు.
ఏడు వేల కోట్లతో ఎంతో చేయొచ్చు...
ఏడు వేల కోట్ల రూపాయల విలువైన నాదర్ గుల్ భూములతో పేదల సంక్షేమం కోసం ఎంతో చేయొచ్చు. ఐదు లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ లు, ఏడు లక్షల మందికి రుణ మాఫీ, 1400 క్రీడా అకాడమీలు, 40 లక్షల మంది నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు, లక్షా 40 వేల లైబ్రరీ లు కట్టొచ్చన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏఐ పరిశోధనా కేంద్రం, 2 లక్షల 80 వేల మందిని విదేశాలకు పంపొచ్చని తెలిపారు. సీఎం, పొంగులేటి న్యాయంగా సంపాదించుకుంటే అభ్యంతరం లేదన్నారు.
పొంగులేటి కొడుకు ఎన్ని కంపెనీలకు డైరెక్టర్ గా ఉంటారు?
అడ్డా కూలీలుగా పని చేసి డబ్బులు సంపాదించుకుంటే మాకు అభ్యంతరం లేదు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే గొప్ప ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చింది. ఈ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఏ కోర్టు రెస్క్యూకి రాదు. ఆ చట్టం 26 వ సెక్షన్ బలంగా ఉంది. సుమోటోగా నాదర్ గుల్ భూములఫై చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని పేదలకు అనుకూలంగా అన్వయించుకోవాలి. ఇది పొంగులేటికి సాయం చేయడానికి కాదు. ఉన్నతాధికారులు ఉపేక్షిస్తే ఊచలు లెక్కించాల్సిందే అని ఫైరయ్యారు.
నిన్ననే 9 మంది పోలీసులకు ఉరి శిక్ష వేశారు..
నిన్న తమిళనాడులో తొమ్మిది మంది పోలీస్ అధికారులకు ఓ కోర్టు ఉరి శిక్ష విధించింది. న్యాయం బతికుందని కోర్టు నిరూపించింది. కేసీఆర్ పాలనలో డోపామైన్,సెరిటోమి, ఎండార్ఫిన్ హర్మోనులు పెరగడంతో మనిషి ఆయుష్షు మూడు నాలుగేళ్లు పెరిగింది. కాంగ్రెస్ పాలనలో ప్రజల రక్తంలో కార్టిజన్ పెరిగి ఒక సంవత్సరం 20 రోజుల ఆయుష్షు తగ్గింది. అధిజారులకు 72 గంటల టైం ఇస్తున్నాం. 373 ఎకరాల్లో పెట్టిన బ్లూ షీట్స్ తొలగించాలి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద 50 ఎకరాలను వదిలిపెట్టి మిగతా 325 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆక్రమణలు తొలగించాలి. ప్రభుత్వం స్పందించకపోతే మేమే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం అని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




