CID Investigation | నేడు సీఐడీ విచారణకు పాడి కౌశిక్‌రెడ్డి దంపతులు
CID Investigation | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు (Koushik Reddy and his wife) నేడు సీఐడీ విచారణ(CID Investigation) కు హాజరు కానున్నారు. ఏప్రిల్ 4న ఉదయం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
త్రినేత్ర.న్యూస్: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు (Koushik Reddy and his wife) నేడు సీఐడీ విచారణ(CID Investigation) కు హాజరు కానున్నారు. ఏప్రిల్ 4న ఉదయం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. గత జనవరి 29న సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కౌశిక్‌రెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా, మరో 15 మందిని సహ నిందితులుగా చేర్చారు. గుర్తింపు పత్రాలు, సంబంధిత డాక్యుమెంట్లు వెంట తీసుకురావాలని సీఐడీ సూచించింది.
కేసుతో నా భార్యకు సంబంధం లేదు..
ఇవాళ ఉదయం సీఐడీ విచారణకు హాజరయ్యే ముందు కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన భార్యపై కేసు పెట్టాల్సిన అవసరం ఏముందని.. తనపై, తన కుటుంబంపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ గొడవతో, తన భార్యకు సంబంధం లేదన్నారు. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులను ప్రశ్నిస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా నోటిసులు ఇవ్వాల్సిన పనేముందని కౌశిక్‌రెడ్డి ఫైరయ్యారు.
కాగా BNSS సెక్షన్ 35(3) కింద విచారణ నోటీసు జారీ చేసినట్లు సీఐడీ విచారణ అధికారి ఎన్ సీహెచ్ రంగస్వామి తెలిపారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో 30/2026 నంబర్‌తో కేసు నమోదైనట్లు చెప్పారు. పోలీసుల విధులకు అడ్డుపడడమే కాకుండా అధికారులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని.. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినట్టు కేసు నమోదైందని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




