KTR | భేషజాలొద్దు.. ‘టిమ్స్’ సేవలను సత్వరమే ప్రారంభించండి: కేటీఆర్
KTR | దలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలోనే టిమ్స్ (TIMS) ఆసుపత్రులకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా రూ.1200 కోట్లతో ఒక్కో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారని చెప్పారు.
- పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందాలన్నది కేసీఆర్ కల
- బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ చుట్టూ టిమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టాం
- అత్యాధునిక 1000 పడకలతో సనత్‌నగర్ టిమ్స్ ఏర్పాటైంది
- 200 పడకలతో కేసీఆర్ ధర్మశాల కట్టించారు
- కేసీఆర్‌కు పేరొస్తదని అసూయ పడకుండా సేవలు ప్రారంభించాలి
- మిగిలిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి
- సనత్‌నగర్ టిమ్స్ సందర్శనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్: పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలోనే టిమ్స్ (TIMS) ఆసుపత్రులకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా రూ.1200 కోట్లతో ఒక్కో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారని చెప్పారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యసేవలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారత రాష్ట్ర సమితి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఉండి ఉంటే రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది..
హైదరాబాద్‌కు నాలుగు వైపులా టిమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే.. రెండేళ్ల క్రితమే టిమ్స్ పూర్తయ్యేది. ఆయనకు పేరు వస్తుందని భేషజాలకు పోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పటికైనా స్పందించి సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి టిమ్స్, ఎంజీఎం వరంగల్, నిమ్స్ విస్తరణ పనులను సత్వరమే పూర్తి చేయాలి. వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలి అని కేటీఆర్ కోరారు.

16 ఆపరేషన్ థియేటర్లు..
సనత్‌నగర్ టిమ్స్‌లో 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నయి. 300 ఐసీయూ బెడ్స్ ఉన్నయి. రేడియాలజీ, ఎమ్మారై, సీటీ స్కాన్‌తో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉన్నయి. వీఐపీ సూట్స్‌లు కూడా 30 పెట్టారు. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు పరిశోధనలు కూడా జరగాలి. అకడమిక్ బ్లాక్, రీసెర్చ్ బ్లాక్ తో పాటు 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియం కూడా నిర్మాణం జరిగింది. 1000 కార్లు పట్టేలా పార్కింగ్ వ్యవస్థ కూడా ఉంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఒక పాట ఉండేదని.. ఇప్పుడు ఆ పాటను మరిచేలా నేను పోతే సర్కారు దవాఖానకే పోతా అని అనుకునేలా ఆస్పత్రుల నిర్మాణం చేసిన ఇంజినీర్లకు, కార్మికులకు ధన్యవాదాలు అని కేటీఆర్ కొనియాడారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు..
హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే హైదరాబాద్‌లో ప్రధాన ఆధారం. మా ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చాం. హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం సామాన్యులకూ అందాలనే కేసీఆర్ ఆలోచనతో టిమ్స్‌ను రూపకల్పన చేశాం.
అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాం.
జిల్లాకో మెడికల్ కాలేజీ..
పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆలోచనతోనే జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి హైదరాబాద్ లో నిజాం కట్టిన గాంధీ, నిమ్స్, ఉస్మానియా తప్ప అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు కట్టలేదు? కేసీఆర్ బసవతారకం ఆసుపత్రి బయట రోడ్డు మీద అటెండెంట్స్ పడుకోవడం చూసి.. టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలో వాళ్ల కోసం 200 పడకలతో ఆధునిక స్థాయిలో ధర్మశాల కట్టించాడు. ఒక రాజభవనాన్ని తలపించేలా పేదల కోసం హైదరాబాద్ లో నాలుగు వైపులా ఇలాంటి టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ కట్టించాడు అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




