Telangana | ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మునిసిపల్ ఎన్నికలు
తెలంగాణ వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు గాను 2026 జనవరి నెలాఖరుగానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మంత్రి ఉత్తమ్ తన నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో వారికి లీక్ ఇచ్చారు.
ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మునిసిపల్ ఎన్నికలు
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రంలో నాలుగైదు మినహా దాదాపుగా అన్ని మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం సమాయత్తమైంది. ఈ మేరకు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డులవారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని షెడ్యూల్ విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను 2025 అక్టోబర్ 1 ఆధారంగా జాబితాను రూపొందించాలని స్పష్టంచేశారు. మున్సిపాలిటీల్లోని వార్డులవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసే బాధ్యతను కమిషనర్లకు అప్పగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 10న తుది జాబితా ప్రకటించనున్నారు.
ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇదీ
డిసెంబర్ 30-31: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల వివరాల పునర్వ్యవస్థీకరణ
జనవరి 1, 2026: ముసాయిదా జాబి తా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ
జనవరి 5, 6 : కమిషనర్లు, జిల్లా ఎన్ని కల అధికారులతో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.
జనవరి 10 : తుది జాబితా ప్రచురణ.
మరి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడో
జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ముగిసింది. సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట మినహా మిగతా మున్సిపాలిటీల గడువు కూడా తీరింది. ఇవి మినహా మిగతా పురపాలికలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఓఆర్‌ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశా రు. ఇందులో జీహెచ్‌ఎంసీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఉన్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వెంటనే జరుగుతాయా? మరింత ఆలస్యం కానున్నాయా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్నికలకు సిద్ధం అవండి: మంత్రి ఉత్తమ్
కాగా, హుజూర్ నగర్, నేరెడు చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. మునిసిపల్ ఎన్నికలు 2026 జనవరి నెలాఖరులోగానీ, ఫిబ్రవరి మొదటవారంలో గానీ జరగనున్నాయని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే తాను ఆ రెండు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై చర్చిద్దామని చెప్పారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






