త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Godu | భార‌త్ స‌మ్మిట్‌కు రాహుల్ వ‌స్తున్నారు

Maheshkumar Godu | హైద‌రాబాద్‌ (Hyderabad)లో నిర్వ‌హించే భార‌త్ స‌మ్మిట్‌ (Bharath Summit)లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ‌స్తున్నార‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్‌గౌడ్ (Maheshkumar Godu) తెలిపారు.

S

Telangana | Published On Nov 10, 2026, 4.08 pm IST

Maheshkumar Godu | భార‌త్ స‌మ్మిట్‌కు రాహుల్ వ‌స్తున్నారు
Advertisement
  • 13, 14 తేదీల్లో హైద‌రాబాద్‌లో ఉంటారు
  • గిగ్ వర్కర్ల‌తో సమావేశం పెట్టాలని చెప్పిండు
  • ఓబీసీల ప్రాతినిధ్యంపై చర్చ జరిగింది
  • రాహుల్ గాంధీతో భేటీ అనంత‌రం టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్ వ్యాఖ్య‌లు

Maheshkumar Godu | త్రినేత్ర న్యూస్: హైద‌రాబాద్‌ (Hyderabad)లో నిర్వ‌హించే భార‌త్ స‌మ్మిట్‌ (Bharath Summit)లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ‌స్తున్నార‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్‌గౌడ్ (Maheshkumar Godu) తెలిపారు. 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు ఇక్క‌డే ఉంటార‌న్నారు. గిగ్‌వ‌ర్క‌ర్ల‌తో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని చెప్పార‌ని వివ‌రించారు. మంగ‌ళ‌వారం ఢిల్లీలో రాహుల్‌తో భేటీ అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఓబీసీల విషయంపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు సమావేశం కొన‌సాగిన‌ట్లు వెల్ల‌డించారు.

గొడ‌వ‌ల విష‌యం రాహుల్‌కు చెప్ప‌లే

భారత్ సమ్మిట్ తో పాటూ గిగ్ వర్కర్ల సమావేశంలో రాహుల్ పాల్గొంటారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ యాక్ట్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ అమలు చేస్తున్న కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చాను. సంస్థాగతంగా తెలంగాణలో కాంగ్రెస్ బూత్ స్థాయి నుంచి.. రాష్ట్రస్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాలు రాహుల్ కు వివరించాం. నేతల మధ్యల గొడవలు.. పంచాయితీలపై రాహుల్ తో చర్చ జరగలేదు. ఆ వ్యవహారం పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారు

బీసీ ర్యాలీకి రావాల‌ని కోరాం

హైదరాబాద్ లో సర్‌కు వ్యతిరేకంగా సభ ఉంటుంది. మెగా బీసీ ర్యాలీకి రాహుల్ ను రావాలని కోరాం. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. నవంబర్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తాం. సోనియా గాంధీ ఆత్మకథను స్వాగతిస్తున్నాం. తెలంగాణలో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.

70 దేశాల నుంచి స‌మ్మిట్‌కు వ‌స్తారు

హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాల నుంచి ప్రతినిధులు భారత్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. సార్వత్రిక ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ అంశాలపై సమ్మిట్‌లో చర్చలు జరగనున్నాయి. సార్వత్రిక ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ అంశాలపై సమ్మిట్‌లో చర్చలు జరగనున్నాయి. గత ఏడాది నిర్వహించిన భారత్ సమ్మిట్‌కు సుమారు 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

గతేడాది సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ ఏడాది భారత్ సమ్మిట్‌కు కూడా రాహుల్ హాజర‌వుతారు. ఢిల్లీ నుంచి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా సమ్మిట్‌కు వ‌స్తారు. ⁠అంతర్జాతీయ ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొనే ఈ సమ్మిట్ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసేస్తున్నాను అని మ‌హేశ్‌కుమార్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement