త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Auto Union Strike | ఎల్‌పీజీ కొర‌త తీర్చాలే.. పాత రేట్ల‌కే స్టిక్క‌ర్లియ్యాలే: ఆటో డ్రైవ‌ర్ల డిమాండ్

Strike | తెలంగాణలో ఆటో (Auto) ఎల్‌పీజీ (LPG) సరఫరా కొరతను నివారించాలని, రవాణా వాహనాలపై రేడియం స్టిక్కర్ల (Radium stickers) భారీ దోపిడీని అరికట్టాల‌ని ఆటో డ్రైవ‌ర్లు (Auto Drivers) డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సోమ‌వారం వారు ఆందోళ‌న(Strike) చేప‌ట్టారు.

S

News | Published On Apr 6, 2026, 3.51 pm IST

Auto Union Strike | ఎల్‌పీజీ కొర‌త తీర్చాలే.. పాత రేట్ల‌కే స్టిక్క‌ర్లియ్యాలే: ఆటో డ్రైవ‌ర్ల డిమాండ్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణలో ఆటో (Auto) ఎల్‌పీజీ (LPG) సరఫరా కొరతను నివారించాలని, రవాణా వాహనాలపై రేడియం స్టిక్కర్ల (Radium stickers) భారీ దోపిడీని అరికట్టాల‌ని ఆటో డ్రైవ‌ర్లు (Auto Drivers) డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సోమ‌వారం వారు ఆందోళ‌న(Strike) చేప‌ట్టారు. ఆటో ట్యాక్సీల్లో ఎల్‌పీజీ గ్యాస్ బ్లాక్ దందాను నివారించాల‌ని బీఎంఎస్ ఆధ్వ‌ర్యంలో క‌దం తొక్కారు. ఈ సంద‌ర్భంగా త‌మ డిమాండ్లను ప‌రిష్క‌రించాల‌ని పెద్ద ఎత్తున‌ నినాదాలు చేశారు.

అనంత‌రం నాయ‌కులు మాట్లాడుతూ.. ఆర్టీవోలో రేడియం స్టిక్కర్ల 6 వేల కోట్ల ఆర్థిక దోపిడీని అరిక‌ట్టాల‌న్నారు. హైదరాబాద్ లో 90 శాతం ఆటోలు LPGతో నడుస్తున్నాయ‌ని.. దేశంలో ఎక్క‌డా ఇంధ‌న‌, ఎల్‌పీజీ గ్యాస్ కొర‌త లేద‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నా ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంద‌న్నారు. కనీసం 2.5 నుంచి 3.5 కిలోమీటర్ల మేర వాహ‌నాలు బారులుతీరే ప‌రిస్థితి ఉంద‌న్నారు. LPG గ్యాస్ బంకు యజమానులు బ్లాక్ మార్కెట్ కు తెర లేపుతున్నార‌ని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ తో, ఢిల్లీ, బెంగుళూరు, తమిళనాడులో లేని LPG గ్యాస్ కొరత ఇక్క‌డెందుకు ఉంద‌ని ప్ర‌శ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వాహనాల స్టిక్కర్ల కోసం బయట రాష్ట్రాల కార్పోరేట్ కంపెనీలకు టెండర్ ఇచ్చి రేట్లు రెట్టింపు చేసింద‌ని మండిప‌డ్డారు. ఆటో రేడియంకు రూ.1000 అయితే అదే గూడ్స్ వాహనానికి రూ. 5000 వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. వెంటనే రవాణా వాహనాల స్టిక్కర్ ధరలను పాత ధరలకే అతికించేలా జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ టెండర్ ఇచ్చిన కార్పోరేట్ కంపెనీలతో చర్చించి సమస్య పరిష్కారం చేయాలని బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో&ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ నాయ‌కులు డిమాండ్ చేశారు.

ఇవీ డిమాండ్లు...

  • హైదరాబాద్ లో ఆటోలకు LPG సరఫరా కొరత లేకుండా చూడాలి
  • LPG గ్యాస్ ఔట్లెట్స్ పెంచాలి
  • LPG బ్లాక్ దందాను అరికట్టాలి
  • రాష్ట్ర వ్యాప్తంగా రేడియం స్టిక్కర్ ధరలను పాత ధరలకే ఇచ్చేలా కార్పొరేట్ కంపెనీలకు సూచించాలి
  • RTA కార్యాలయాల్లో ఆర్థిక దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
  • రేడియం స్టిక్కర్ల పేరుతో సుమారు 6 వేల కోట్ల రూపాయల ఆర్థిక దోపిడీని వెంటనే ఆపేయాలి

లేని పక్షంలో ఆటో &ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన చేపడుతుందని హెచ్చ‌రించారు.
బీపీటీఎంఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, తెలంగాణ స్టేట్ ఆటో&టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్ నంద కిశోర్, ప్రధాన కార్యదర్శి బీ పెంటయ్య గౌడ్, గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అశ్విన్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు హబీబ్, తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీధర్ రెడ్డి , కార్యద్యక్షులు సమ్మయ్య యాదవ్, మినీ గూడ్స్ వెహికిల్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జహంగీర్ , ఆర్.మహేష్, రాములు, పరశురాం, బాబురాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement