KTR | మరో ప్రతిన బూనుదాం.. మరోసారి తెగించి కొట్లాడుదాం: కేటీఆర్
KTR | బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవం (Formation day) సందర్భంగా మరో ప్రతిన బూనుదామని.. తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కోట్లాది ప్రజల పక్షాన దగాకోరు సర్కారుపై సమరశంఖం పూరించి, తెలంగాణ గొంతుకగా నిలిచిన చరిత మనదన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్: ఎన్నో త్యాగాలు, బలిదానాల పునాదుల మీద సాధించిన తెలంగాణ.. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో విధ్వంసం అవుతోందని, బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవం (Formation day) సందర్భంగా మరో ప్రతిన బూనుదామని.. తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మొన్న ఉద్యమ పార్టీగా.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కీర్తి మనదని.. నిన్న అధికార పార్టీగా పదేళ్లపాటు రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించిన ఘనత మనదని ఉద్ఘాటించారు. నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కోట్లాది ప్రజల పక్షాన దగాకోరు సర్కారుపై సమరశంఖం పూరించి, తెలంగాణ గొంతుకగా నిలిచిన చరిత మనదన్నారు.

పార్టీ సైనికులకు శుభాకాంక్షలు..
ప్రజలతో విడదీయలేని పేగు బంధానికి ప్రతీక. తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వ పతాక.. మన గులాబీ జెండా 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ శక్తినంతా ధారపోసి నిస్వార్థంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రతి పేజీ చరిత్రాత్మకం...
తెలంగాణ జాతిపిత కేసీఆర్ సారథ్యంలో, ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలోని ప్రతి పేజీ చరిత్రాత్మకం. ప్రతి పోరాటం ప్రతిష్టాత్మకం. ప్రతి మలుపు ఓ చెరగని సంతకం. ఎన్నెన్నో త్యాగాలు, బలిదానాల పునాదుల మీద సాధించిన తెలంగాణ.. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో విధ్వంసం అవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరో ప్రతిన బూనుదాం. తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కొట్లాడుదాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనమంతా పునరంకితం అవుదాం అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
మొన్న ఉద్యమ పార్టీగా..
ఢిల్లీ మెడలు వంచి
తెలంగాణ సాధించిన
కీర్తి మనది..!!నిన్న అధికార పార్టీగా..
పదేళ్లపాటు రాష్ట్రాన్ని
ప్రగతి పథాన నడిపించిన
ఘనత మనది..!!నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా..
కోట్లాది ప్రజల పక్షాన
దగాకోరు సర్కారుపై
సమరశంఖం పూరించి
తెలంగాణ గొంతుకగా నిలిచిన…— KTR (@KTRBRS) April 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



