త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ర‌వాణా శాఖ ఆదాయం పెంచుదాం: పొన్నం

Ponnam Prabhakar | ర‌వాణా శాఖలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసి ఆదాయాన్నిపెంచుకోవాల‌ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సచివాలయం(secretariat) లో మంగ‌ళ‌వారం రవాణా శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. 2024-25 లో 6910.90 కోట్లు ఆదాయం రాగా 2025-26లో 7097.38 కోట్లు వసూలయ్యాయ‌న్నారు.

S

News | Published On Apr 7, 2026, 6.36 pm IST

Ponnam Prabhakar | ర‌వాణా శాఖ ఆదాయం పెంచుదాం: పొన్నం
Advertisement

- 17 జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు గుర్తించాలి
- అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
- సారథితో దేశంలోనే తెలంగాణకు ప్రథమ స్థానం
- ఇంకా ప‌ని తీరు మెరుగుప‌ర్చుకోండి
- జూన్ 1 నాటికి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించేలా పనులు చేయాలి
- రవాణా శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

త్రినేత్ర‌.న్యూస్‌: ర‌వాణా శాఖలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసి ఆదాయాన్నిపెంచుకోవాల‌ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సచివాలయం(secretariat) లో మంగ‌ళ‌వారం రవాణా శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. 2024-25 లో 6910.90 కోట్లు ఆదాయం రాగా 2025-26లో 7097.38 కోట్లు వసూలయ్యాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఈవీ పాలసీ ద్వారా ఆదాయం కొంతమేర తగ్గినట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు. గతంలో లైఫ్ టాక్స్, త్రైమాసిక టాక్స్ వసూలులో మంచి పనితీరు కనబరచిన అధికారులను పొన్నం అభినందించారు. కొంద‌రు అధికారులు పనితీరు మెరుగు పరచుకోవాలని హెచ్చరించారు.

నిజామాబాద్ - మహారాష్ట్ర , ఆదిలాబాద్ - మహారాష్ట్ర, మెదక్ - కర్ణాటక తదితర సరిహద్దు జిల్లాల రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహన్ పోర్టల్ ద్వారా సేవలు డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. సారథి అమలు తర్వాత 8 నెలల్లోనే దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని సంతోషం వ్య‌క్తం చేశారు. ఏఎంవీఐలకు ఇచ్చిన శిక్షణ మాదిరిగా ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారీగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీస్, రవాణా శాఖ క‌లిసి జ‌య‌ప్ర‌దం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల‌పై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ మంజూర‌య్యాయని జూన్ 1న తొలి టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్ ల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. త్వ‌ర‌లో వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిర్భయ ఫ్రేమ్ అందుబాటులోకి రానుందని తెలిపారు.

అత్యవసరంగా హాస్పిటల్ కి తీసుకెళ్లిన వారికి రహవీర్ అవార్డు కింద 25 వేలు బహుమతి అందించనున్న‌ట్లు చెప్పారు. తొలి రహవీర్ నల్గొండ జిల్లాకు చెందిన గణపతి వెంకన్నకు 25 వేల రూపాయల చెక్కు ఇచ్చి అభినందించారు. PM RAHAT కింద రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు లక్షా 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించవచ్చన్నారు. దీనిపై ప్రజలకు విసృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 17 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు గుర్తించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్, డీటీసీలు, డీటీవోలు, ఆర్టీవోలు, ఏంవీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement