ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను బండి ఎక్కించి చంపేస్తే …అడిగేవాడు లేడు
చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాథుడు లేడు, పట్టించుకునేవాడు లేడు, ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు.
నగరం నడిబొడ్డున కాల్పులు జరిపినా
పట్టించుకునే వాడే లేడు
మంత్రుల కార్ల అద్దాలూ ధ్వంసం చేస్తున్నారు
రాష్ట్రంలో ఇంత దయనీయంగా మారిన పరిస్థితులు
విలేకరుల సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనట్టు చోద్యం చూస్తూ కూర్చున్నదని బీఆర్ ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆదివారం రాత్రి... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సిట్ (SIT) విచారణ ముగిసిన అనంతరం.. విలేకరులతో మాట్లాడారు.
👉🏿 ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఈరోజు గర్జించారు, గ్రామ గ్రామాన తిరగబడ్డారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గొప్పగా పోరాడారు. సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు. అట్లాగే గ్రామ గ్రామాన మా కార్యకర్తలు, అట్లాగే ప్రతి పట్టణంలో పదం తొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు, అట్లాగే రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళొకసారి మీడియాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
👉🏿 ఇవాళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో, సుల్తాన్ బజార్ పరిధిలో పొద్దున ఎనిమిది గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాథుడు గాని, ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతిభద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు.
👉🏿 చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాథుడు లేడు, పట్టించుకునేవాడు లేడు, ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు.
👉🏿 సమ్మక్క సారక్క జాతర... కోట్లాదిమంది ప్రజలు గొప్పగా తెలంగాణ కుంభమేళాగా జరిగే అద్భుతమైన పండుగ, తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. అలాంటి పండుగలో అధ్వానమైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే, అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల నిర్వహణ,
👉🏿కనీసం ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు. ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు... మరి గతంలో ఒక సినిమా వచ్చింది హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని మూడు భాగాలుగా. అట్లాగే సిట్ 1 (SIT 1), సిట్ 2 (SIT 2) అని చెప్పి టైం పాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



