త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | వ‌చ్చే నెల‌లో కొముర‌వెళ్లి రైల్వే స్టేష‌న్ ప్రారంభిస్తాం: కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | వ‌చ్చే నెల మొద‌టి వారంలో కొముర‌వెళ్లి (Komuravelli) మ‌ల్ల‌న్న స్వామి రైల్వే స్టేష‌న్‌ను భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. శ‌నివారం హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట‌, ఉప్పుగూడ రైల్వే స్టేష‌న్ల‌ను ఆయ‌న అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ను రూ.720 కోట్ల‌తో శంషాబాద్ త‌ర‌హాలో అభివృద్ధి చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

S

News | Published On May 16, 2026, 1.50 pm IST

Kishan Reddy | వ‌చ్చే నెల‌లో కొముర‌వెళ్లి రైల్వే స్టేష‌న్ ప్రారంభిస్తాం: కిష‌న్‌రెడ్డి
Advertisement
  • మ‌ల‌క్‌పేట‌, ఉప్పుగూడ రైల్వే స్టేష‌న్లను ఆధునీక‌రిస్తున్నం
  • రూ.720 కోట్ల‌తో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ అభివృద్ధి
  • సెకండ్ ఫేజ్ లో యాద‌గిరిగుట్ట వ‌ర‌కు ఎంఎంటీఎస్ విస్త‌ర‌ణ‌
  • మ‌ల‌క్‌పేట‌, ఉప్పుగూడ రైల్వే స్టేష‌న్ల ప‌రిశీల‌న‌లో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్: వ‌చ్చే నెల మొద‌టి వారంలో కొముర‌వెళ్లి (Komuravelli) మ‌ల్ల‌న్న స్వామి రైల్వే స్టేష‌న్‌ను భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. శ‌నివారం హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట‌, ఉప్పుగూడ రైల్వే స్టేష‌న్ల‌ను ఆయ‌న అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ రైల్వే స్టేష‌న్ల‌కు ప్రాధాన్యం త‌గ్గింద‌ని, తిరిగి పూర్వ వైభ‌వం తీసుకొస్తామ‌ని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ను రూ.720 కోట్ల‌తో శంషాబాద్ త‌ర‌హాలో అభివృద్ధి చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

పాత ప‌ట్నంలోని మ‌ల‌క్‌పేట‌, ఉప్పుగూడ రైల్వే స్టేష‌న్లకు కాల‌క్ర‌మేణా ప్రాధాన్యం తగ్గింది. ప్ర‌ధాని మోదీ హ‌యాంలో వాటిని పున‌రుద్ధ‌రిస్తున్నం. ఆధునిక ప‌ద్ధ‌తుల్లో అభివృద్ధి చేస్తున్నం. పాత ప‌ట్నం ప్ర‌జ‌ల‌కు ఈ రైల్వే స్టేష‌న్లు అందుబాటులోకి తేవాలని సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నం. ఇక్క‌డికి వ‌చ్చినా, చూసినా నూత‌న హంగుల‌తో క‌నిపించేలా త‌యారు చేస్తాం అని కేంద్ర‌మంత్రి చెప్పారు.

హైద‌రాబాద్ నుంచి భ‌క్తులు వెళ్లేలా..

ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా ముందుకు తీసుకెళ్తున్నం. రైల్వే నెట్‌వ‌ర్క్ అభివృద్ధి అయితే ఇక్క‌డి నుంచి యాద‌గిరిగుట్ట వ‌ర‌కు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌ను విస్త‌రిస్తున్నం. అలాగే ఇక్క‌డి నుంచి కొముర‌వెళ్లి మ‌ల్ల‌న్న రైల్వే స్టేష‌న్‌ను అన్ని సౌక‌ర్యాల‌తో ఏర్పాటు చేశాం. వ‌చ్చే నెల మొద‌టి వారంలో ప్రారంభించ‌బోతున్నం. భ‌క్తుల‌కు , మ‌ల్ల‌న్న పాదాల‌కు అంకితం చేయ‌బోతున్నం. హైద‌రాబాద్ నుంచి వెళ్లే భ‌క్తుల కోసం నిర్మాణం చేశాం.

రూ.355 కోట్ల‌తో నాంప‌ల్లి స్టేష‌న్ అభివృద్ధి..

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ను రూ.720 కోట్ల‌తో అభివృద్ధి చేస్తున్నాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టు త‌ర‌హాలో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ అభివృద్ధి కాబోతుంది. నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్‌ను రూ.355 కోట్ల‌తో అభివృద్ధి చేస్తున్నాం. వేగవంతంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. దీంతో పాటు మొత్తం హైద‌రాబాద్‌లో హ‌ఫీజ్‌పేట‌, బేగంపేట‌, నాంప‌ల్లి, సికింద్రాబాద్‌, హైటెక్ సిటీ, మ‌ల‌క్‌పేట‌, యాకుత్ పుర‌, ఉప్పుగూడ‌, హుందాన‌గ‌ర్‌, షాద్‌న‌గ‌ర్‌, మ‌ల్కాజిగిరి, మేడ్చల్ రైల్వే స్టేష‌న్ల‌ను స‌మాంత‌రంగా మోదీ ప్ర‌భుత్వం అభివృద్ధి చేస్తున్నది.

Advertisement
Advertisement