MP Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్‌లో ముసలం మొదలైంది: ఎంపీ చామల
MP Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ (BRS) పార్టీలో ముసలం మొదలైందని, జీవన్‌రెడ్డి (Jeevan Reddy) చేరిక ఇష్టం లేకే హరీశ్‌రావు (Harish Rao) ఢిల్లీ వెళ్లారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఢిల్లీలో ఎవరిని కలిసి మాట్లాడారనేది త్వరలోనే బయటకు వస్తుందన్నారు.
త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ (BRS) పార్టీలో ముసలం మొదలైందని, జీవన్‌రెడ్డి (Jeevan Reddy) చేరిక ఇష్టం లేకే హరీశ్‌రావు (Harish Rao) ఢిల్లీ వెళ్లారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఢిల్లీలో ఎవరిని కలిసి మాట్లాడారనేది త్వరలోనే బయటకు వస్తుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు.
జీవన్ రెడ్డి పార్టీలో చేరడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదు. జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు పార్టీలోకి రమ్మని ఆహ్వానించలేదు. కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు కూడా హరీశ్ రావు వెళ్లలేదు. రెండవసారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కేటీఆర్ హరీశ్‌రావు ఇంటికి వెళ్లి బతిమిలాడి తీసుకెళ్లారు. కేసీఆర్ ఇంటికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా హరీశ్‌రావు వెళ్లలేదు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటుంది అని చామల వ్యాఖ్యానించారు.
కేసీఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తుంటే హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. బీఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉంది. హరీశ్ రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. కేసీఆర్ సంవత్సరంలో ఒక రోజు పండుగకు బయటకు వస్తున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం వాళ్ల కార్యకర్తలకే ఇష్టం లేదు అని అన్నారు.
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ సముచిత స్థానం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క రోజు మాత్రమే వీఐపీ. బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్‌లో ముసలం మొదలైంది. అది ఎన్నటికైనా మునిగిపోయే నావనే అని చామల వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



