Indigo | ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకం.. ఆన్‌లైన్‌లో వివాహ రిసిప్షన్
Indigo |ఇండిగో (Indigo) విమానాల రద్దుతో నూతన వధూవరులు తమ వివాహ రిసిప్షన్ (Wedding Reception) కు తామే ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. అతిథుల దగ్గర నుంచి వర్చువల్ (Virtual) గా ఆశీస్సులు స్వీకరించారు.
Indigo | ఇండిగో (Indigo) విమానాల రద్దుతో ఇటీవల వివాహం చేసుకున్న ఓ జంట విచిత్రమైన పరిస్థతి ఎదుర్కొంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆన్‌లైన్‌లోనే వివాహ రిసిప్షన్ (Online Reception) కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్నారు. వేడుకలకు హాజరైన అతిథులు వర్చువల్ (Virtual) గా స్క్రీన్‌పై నూతన జంటను చూసి ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చుక్కలనంటుతున్న విమాన టికెట్ల ధరలు
ఒకవైపు దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. ఈ విమానాల రద్దు శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని ఇప్పటికే కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు ఇండిగో విమానాల రద్దుతో ఇతర విమానాల టికెట్ల ధరలు చుక్కలను తాకుతుండడంతో పాటు టికెట్లు సైతం అందుబాటులోకి లేకుండా పోయాయి.
భువనేశ్వర్‌లో వివాహం... హుబ్లీలో విందు
ఒడిషాలోని భువనేశ్వర్ (Bhuvaneshwar)కు చెందిన సంగమదాస్, కర్ణాటకలోని హుబ్లీ (Hubli)కి చెందిన మేధాక్షీర్ సాగర్ ఇద్దరూ బెంగుళూర్ (Bengaluru) లో సాఫ్ట్‌వేర్ (Software) ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి వివాహం గత నెల 23న భువనేశ్వర్‌లో జరిగింది. ఈ నెల 4న హుబ్లీలో వివాహ రిసిప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం 2న భువనేశ్వర్ నుంచి బెంగుళూర్ మీదుగా హుబ్లీకి వెళ్లేందుకు ఇండిగో విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. రెండో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న నూతన వధూవరులు విమానం కోసం బుధవారం వరకు వేచి చూశారు. చివరికి విమానం రద్దు చేస్తున్నట్లు అధికారుల ప్రకటించారు. దాంతో పాటు భువనేశ్వర్ నుంచి ముంబై మీదుగా హుబ్లీకి వెళ్లే వారి బంధువుల విమానాలు సైతం రద్దయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి తలెత్తింది.
క్రియేటివ్ ఐడియా.. ఆన్‌లైన్ రిసిప్షన్
విమానాల రద్దుతో భువనేశ్వర్‌లో చిక్కుకుపోయిన వధూవరులు నిరాశ చెందకుండా ఆన్‌లైన్‌లో రిసిప్షన్ చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పటికే బంధువులు, సన్నిహితులకు రిసిప్షన్ కోసం హుబ్లీకి చేరుకోవడంతో యధాతథంగా వేడుకను నిర్వహించారు. వధూవరులు ముస్తాబై కూర్చుని, వర్చువల్‌గా వేడుక జరిగే వేదికపై స్క్రీన్‌పై దర్శనమిచ్చారు. అతిథుల నుంచి వర్చువల్ (Virtual)గానే ఆశీస్సులు స్వీకరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IPL 2026 Playoffs Schedule | ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. అహ్మదాబాద్‌లో 31న ఫైనల్..!
మే 6, 2026

Noida Airport | నోయిడా నుంచి తొలి విమానం నవీ ముంబయికే..! ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్..!
మే 6, 2026

Bellamkonda Sreenivas | బెల్లంకొండ శ్రీనివాస్ వెడ్డింగ్ రిసెప్షన్ – హాజరైన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే
మే 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



