Sathish Reddy | మీరు చెప్పులతో కొడితే మేం ఆధారాలతో కొడతాం: సీతక్కకు సతీశ్‌రెడ్డి కౌంటర్
Sathish Reddy | మీరు చెప్పులతో కొడితే మేం ఆధారాలతోనే కొడతామని.. మాకు చెప్పులు అవసరం లేదని.. మంత్రి స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి (Sathish Reddy) సీతక్కకు హితవు పలికారు. మేం మీలాగ అబద్ధాలు చెప్పమని.. విషయం ఏదైనా ఆధారాలు, వాస్తవాలతోనే సమాధానాలు చెబుతామని కౌంటర్ ఇచ్చారు.
- మంత్రి స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా
- మీలా అబద్దాలు చెప్పం.. వాస్తవాలతోనే జవాబిస్తం
- ఎదుదాడితో తప్పించుకోవాలనుకుంటే ఊరుకోం
- అంగన్‌వాడీలకు కేంద్రం 5G ఫోన్లు ఇవ్వమంటే 4G ఇచ్చారు
- ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా
- సీతక్కకు సవాల్ విసిరిన రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి
త్రినేత్ర.న్యూస్: మీరు చెప్పులతో కొడితే మేం ఆధారాలతోనే కొడతామని.. మాకు చెప్పులు అవసరం లేదని.. మంత్రి స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి (Sathish Reddy) సీతక్కకు హితవు పలికారు. మేం మీలాగ అబద్ధాలు చెప్పమని.. విషయం ఏదైనా ఆధారాలు, వాస్తవాలతోనే సమాధానాలు చెబుతామని కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియా(Press meet)తో మాట్లాడారు. అంగన్వాడీల మొబైల్ ఫోన్ల వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఉల్టా చోర్ కొత్వాల్ కోడాంటే..
సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీతక్కపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీతక్క వ్యవహారం ఉల్టా చోర్ కొత్వాల్ కోడాంటే అన్నట్టుగా ఉందన్నారు. అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోలులో కుంభకోణం చేసి అడ్డంగా దొరికిపోయి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు వార్నింగ్ లు ఇవ్వడం ఏంటన్నారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రతీసారి విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఇష్టారీతిగా మాట్లాడే మీరు ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. 5G ఫోన్లు ఇవ్వాలని కేంద్రం చెబితే మీరు 4G ఫోన్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఏపీతో పాటు గుజరాత్, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల్లో 5G ఫోన్లు ఇచ్చారని గుర్తు చేశారు.
4G ఫోన్లు ఇప్పుడు ఔట్ డేట్ అయ్యాయి. అలాంటి ఫోన్లను రూ.11,600 కొన్నామని సీతక్క చెబుతున్నారు. కానీ మార్కెట్ లో రిటైల్ లో కొంటేనే శాంసంగ్ A 06-5G ఫోన్ ధర రూ.9,899 రూపాయలే ఉంది. బల్క్ లో తీసుకుంటే ఒక్కో ఫోన్ మీద మూడు నాలుగు వేలు తగ్గే అవకాశం ఉంది. మరి మీరు 4G ఫోన్ కు రూ.11,600 ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలి అని నిలదీశారు.పైగా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే డబ్బులు మిగిల్చామని గొప్పలు చెప్పుకోవడం అవివేకమన్నారు.
సీబీఐ విచారణ జరిపించాలి..
అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోలులో వంద శాతం స్కాం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు 4G ఫోన్లకు టెండర్ పిలిచినప్పుడే అర్థమైంది. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టే సరికి సీతక్క ఫ్రస్టేషన్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ తప్పూ చేయకపోతే ఫోన్ల కొనుగోలుపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. ముఖ్యమంత్రితో మాట్లాడి సీబీఐ ఎంక్వైరీ కోసం సిఫారసు లేఖ పంపించాలి. ఔట్ డేటెడ్ ఫోన్లను అడ్డగోలు రేట్లకు కొన్నామని అబద్ధాలు చెప్పడం మీకే సాధ్యమైంది. అంతేకాకుండా మాపై ఎదురుదాడి చేసి తప్పించుకుందామనుకుంటున్నారు. ఎవరూ చూస్తూ ఊరుకోరు సీతక్క గారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
బీజేపీ- కాంగ్రెస్ ఒక్కటేనని రుజువైంది..
తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ ఒక్కటయ్యాయని.. మొబైల్ ఫోన్ల స్కాంతో మరోసారి వారి బంధం స్పష్టమైందన్నారు. రేవంత్ సర్కారు స్కాం చేస్తే ఇప్పటి వరకు కూడా దీనిపై ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడకపోవడం విచారకరం. మా అనుమానాలను మరింత బలపరుస్తోంది. ప్రతిదానికి చెంగు చెంగున ఎగిరిన బీజేపీ ఎంపీలు, ప్రస్తుత కేంద్రమంత్రులు ఎందుకు గప్ చుప్ అయిపోయారో కూడా బయటపెట్టాలి. నిజంగానే ఈ స్కాంతో బీజేపీకి సంబంధం లేకపోతే సీబీఐ ఎంక్వైరీకి తప్పకుండా ఆదేశించాలి. కేంద్ర ప్రభుత్వ నిధులు మింగేసిన మంత్రిపై, అందుకు సహకరించిన ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్, బీజేపీ కలిసే ఈ స్కాం చేశాయని భావించాల్సి వస్తుంది అని సతీశ్‌రెడ్డి అన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




