BJP Ramchandar Rao | తెలంగాణలో ఒక్కసారి గెలిస్తే ఇంకెప్పుడూ ఓడిపోం: రాంచందర్‌రావు
BJP Ramchandar Rao | తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ ఫస్ట్ టార్గెట్ అని.. ఇది 2028లో నెరవేరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆల్రెడీ బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పాలనను ప్రజలు చూశారని ఇక ఇప్పుడు టైమ్ బీజేపీదేనని చెప్పారు.
- రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశారు
- ఇక ముందున్నది బీజేపీ టైమే
- 2028లో అధికారంలోకి వస్తం
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఓకే
- మా పార్టీ వ్యక్తి పోక్సో కేసులో లేడు
- కావాలని రాజకీయం చేస్తున్నరు
- బీజేపీ చీఫ్ ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యలు
BJP Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ ఫస్ట్ టార్గెట్ అని.. ఇది 2028లో నెరవేరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆల్రెడీ బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పాలనను ప్రజలు చూశారని ఇక ఇప్పుడు టైమ్ బీజేపీదేనని చెప్పారు. శుక్రవారం వే టు న్యూస్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. గతంతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోమని.. కానీ బీజేపీ కోసం చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రచారం చేస్తే మాత్రం స్వాగతిస్తామని పేర్కొన్నారు.
ఎవరితో పొత్తులుండవు..
ఏదైనా ప్రాంతంలో రెండు పార్టీల మధ్య పోటీ ఉంటే మూడో పార్టీ రావాలంటే కొద్దిగా కష్టమైతది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలన చూశారు. ఇప్పుడు టైమ్ బీజేపీదే. వేరే పార్టీ వాళ్లు, ఇతర ప్రముఖులు స్వతహాగా మా పార్టీలో చేరుతున్నారు. మేము 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గతం గతహా.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోం. కానీ బీజేపీ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే స్వాగతిస్తాం అని బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించారు.
రైతుల కోసం కొట్లాడింది బీజేపీనే..
తెలంగాణలో రైతుల సమస్యలపై ముందు పోరాడింది బీజేపీనే. మా ప్రభుత్వం MSP పెంచినా క్షేత్ర స్థాయిలో తక్కువ ధరకు కొని మోసం చేస్తున్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మేము ఒక్కసారి వస్తే మమ్మల్ని పంపించడం చాలా కష్టం. ఇది ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
బండి సంజయ్ కుటుంబ విషయంలో మేం జోక్యం చేసుకోం..
బండి సంజయ్ కుమారుడి కేసు పూర్తిగా వాళ్ల కుటుంబం విషయం. మా పార్టీ వ్యక్తి ఆ కేసులో లేడు. ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన వ్యక్తి ఉన్నడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు. మేము ఎలాంటి లీగల్ విషయాల్లో జోక్యం చేసుకోం. కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లు అమ్మాయికి న్యాయం చేయాలని అనడం లేదు. ఎంత సేపు బండి సంజయ్ కుటుంబాన్ని డీఫెమ్ చేస్తున్నారు. మెట్రోలో, గోడలపై పోస్టర్లు అంటించి రాజకీయం చేస్తున్నారు అని రాంచందర్‌రావు మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



