CM Revanth Reddy | గ్రూప్-1 నియామకాలపై ‘సుప్రీం’ తీర్పును స్వాగతిస్తున్నా: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల (Group-1 recruitment) విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు(Judgment)ను స్వాగతిస్తున్నానని.. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు గా భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల (Group-1 recruitment) విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు(Judgment)ను స్వాగతిస్తున్నానని.. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు గా భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రజా ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించింది. నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసి, ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించాం. రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్ -1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. వారికి మరోసారి అభినందనలు తెలుపుతున్నా. ప్రభుత్వ ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేశాం. నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కలిగించాం. అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.. అని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు.
గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనంలో తప్పులున్నాయని, నోటిఫికేషన్ రద్దు చేసి, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా నియామక ప్రక్రియ చేపట్టినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం అవసరం లేదని పేర్కొంది.
కాగా కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వారికి ఈ తీర్పుతో పెద్ద ఊరట లభించింది. కన్నవారి కష్టంపై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా 563 పోస్టులకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




