RS Praveen Kumar | ఢిల్లీకి మూటలు పంపేందుకే జీవో 17: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ కాంట్రాక్టు(Govt procurement contracts)ల్లో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. రెండేళ్ల నాలుగు నెలల పాలనలో ఆ వాగ్దానానికి తూట్లు పొడిచిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే జీవో 17 తెచ్చారని ఆరోపించారు.
త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ కాంట్రాక్టు(Govt procurement contracts)ల్లో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. రెండేళ్ల నాలుగు నెలల పాలనలో ఆ వాగ్దానానికి తూట్లు పొడిచిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియా(Press meet)తో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. బడా కాంట్రాక్టర్లను ఏఐసీసీకి ఎటీఎంలు గా మార్చారని ఫైరయ్యారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే జీవో 17 తెచ్చారని ఆరోపించారు.
కర్ణాటకలో 18 శాతం రిజర్వేషన్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 17 తెచ్చి చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొడుతోందని ధ్వజమెత్తారు. ఈ జీవో ప్రకారం స్కూళ్లు, గురుకులాల్లో వస్తువుల సరఫరాకు జాతీయ సంస్థలను టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించిందని, ఇందులో 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తక్షణమే జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ అంటూ తెచ్చిన జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొక్యూర్ మెంట్ పాలసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కర్ణాటకలో ప్రొక్యూర్ మెంట్ పాలసీలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఇక్కడెందుకు కల్పించరు? అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా అని ప్రశ్నించారు.
సీఎం క్షమాపణ చెప్పాలి..
కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ తన పాలన గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పతనం చిన్న తరహా పరిశ్రమలను వీధుల పాలు చేయడమా? ఏపీలో కూడా అక్కడి పరిశ్రమలకే ప్రొక్యూర్ మెంట్ అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జీవో 17 రద్దు చేసి క్షమాపణ చెప్పాలి. ప్రొక్యూర్ మెంట్ పాలసీలో సామాజిక న్యాయం విస్మరించడం తగదు. దీన్ని నిరసిస్తూ సీఎంకు లేఖ రాస్తా అని ఆర్ఎస్పీ వెల్లడించారు.
నోట్ బుక్కులకు వాటర్ మార్క్ నిబంధన..
కేసీఆర్ హయాంలో విద్యా, మైక్రో ఇండస్ట్రీస్ రంగంలో అన్నిరంగాల్లో న్యాయం జరిగింది. 12 వేల మంది చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు కేసీఆర్ న్యాయం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేసింది. బూట్లు, స్కూల్ బ్యాగులు, ట్రంక్ పెట్టెలు బెల్ట్ ల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే 10 నుంచి 25 కోట్ల రూపాయల సాల్వెన్సీ సర్టిఫికెట్ తేవాలని కాంట్రాక్టర్లకు నిబంధన పెట్టారు. నోట్ బుక్కులకు వాటర్ మార్క్ నిబంధన పెట్టారు. అదేమైనా జాతి భద్రతకు సంబంధించిన విషయమా? అని ఫైరయ్యారు.
చేవెళ్ల డిక్లరేషన్ న్యాయం ఇదేనా?
స్థానికంగా ఉన్న చిన్న కంపెనీలను దెబ్బ కొట్టి తమ అస్మదీయ కంపెనీలకు విద్యా రంగ కాంట్రాక్టులు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోంది. హైకోర్టు జీవో 17ను మార్చాలని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చేవెళ్ల డిక్లరేషన్ లో చెప్పిన సామాజిక న్యాయం ఇదేనా? తుగ్లక్ లాగా ఈ ప్రభుత్వం దుర్నీతితో ఆలోచిస్తున్నది. ఏవైనా అభ్యంతరాలు చెప్పాలంటే కూడా కాంట్రాక్టర్ కు వివిధ మొత్తాల్లో డీడీలు కట్టాలని విచిత్రమైన నిబంధన పెట్టారు. బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీ కార్పొరేషన్లకు ఈ టెండర్లలో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు, బడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకే నిబంధనలు మార్చారు అని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




