Duddilla Sridhar Babu | ఎన్ఎస్‌యూఐతోనే సమర్థ నాయకత్వం: మంత్రి శ్రీధర్‌బాబు
NSUI Foundation Day | దేశానికి సమర్థ నాయకత్వం అందించడంలో, దశాబ్దాలుగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటంలో ఎన్ఎస్‌యూఐ(NSUI) పోరాటం అనిర్వచనీయమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu) అన్నారు. గురువారం ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
త్రినేత్ర.న్యూస్: దేశానికి సమర్థ నాయకత్వం అందించడంలో, దశాబ్దాలుగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటంలో ఎన్ఎస్‌యూఐ(NSUI) పోరాటం అనిర్వచనీయమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) అన్నారు. గురువారం ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో విద్యార్థి ఉద్యమంతోనే మార్పు సాధ్యమని చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకులు, ఆ సంస్థ సభ్యులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
చదువు నేర్పిన వివేకం పోరాట పటిమగా మారినప్పుడే దేశ చరిత్ర మారుతుందన్నారు. సమాజంలో ఏ విప్లవాత్మక మార్పు రావాలన్నా దానికి విద్యార్థి ఉద్యమమే తొలి అడుగు అని స్పష్టం చేశారు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం అని పేర్కొన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలచుకొని, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఆ చారిత్రక తొలి అడుగుకు ఎన్ఎస్‌యూఐ దశాబ్దాలుగా శక్తిమంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదమే ప్రాతిపదికగా విద్యార్థి లోకాన్ని ముందుకు నడిపిస్తున్న కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. విజ్ఞానం కేవలం వ్యక్తిగత ఉన్నతికే కాదని, సామాజిక విముక్తికి దారి చూపాలని చెప్పారు. విలువల కోసం నిలబడే తత్వంతో ప్రతి విద్యార్థి నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




