Cyber Crime Awareness Programme | సైబర్ ఫ్రాడ్ కు ఇలా ఫుల్ స్టాప్ పెట్టండి..
Cyber Crime Awareness Programme | శంషాబాద్ జోన్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ (Meerpet Police) ఆధ్వర్యంలో గుర్రంగూడలోని GNR క్రికెట్ అకాడమీలో "సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. నకిలీ కాల్స్ చూసి భయపడకుండా ఉండాలని అవగాహన కల్పించారు.
- సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పోలీసుల సూచన
Cyber Crime Awareness Programme | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ జోన్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ (Meerpet Police) ఆధ్వర్యంలో గుర్రంగూడలోని GNR క్రికెట్ అకాడమీలో "సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మీర్ పేట్ SHO బి.శోభన్ (Shobhan) పర్యవేక్షణలో, ఎస్సై నాగిరెడ్డి, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ మొబైల్ సిబ్బంది సమక్షంలో చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఎల్లప్పుడూ అప్రమత్తత అవసరం...
ఈ సందర్భంగా బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ ప్రవర్తనను పెంపొందించే లక్ష్యంతో "సైబర్ సేఫ్టీ ప్లెడ్జ్" (ప్రతిజ్ఞ) చదివారు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల ధోరణులపై, వాటి నివారణ మార్గాలపై (ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్, Fraud Ka Full stop) అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచితులకు ఓటీపీలు చెప్పకూడదని సూచించారు. అనధికారిక లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్‌లైన్ పార్ట్-టైమ్ జాబ్ ఫ్రాడ్ పేరిట నకిలీ ఉపాధి అవకాశాల పట్ల జాగ్రత్తలు వివరించారు.

నకిలీ కాల్స్‌తో భయమొద్దు..
సోషల్ మీడియా- APK ఫైల్ స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. నకిలీ కాల్స్ చూసి భయపడకుండా ఉండాలని అవగాహన కల్పించారు. మహిళా భద్రత అప్లికేషన్లు, సైబర్ సింహా, సైబర్ మిత్ర సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, ఏదైనా మోసం జరిగినప్పుడు వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని డిజిటల్ భద్రతపై అవగాహన పొందారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




