Samantha | సమంత విలన్‌గా నటించిన ఒకే ఒక సినిమా – కట్ చేస్తే డిజాస్టర్
దక్షిణాదిలో డిఫరెంట్ రోల్స్‌లో టాప్ స్టార్‌గా మారిన సమంత ఓ సినిమాలో విలన్‌గా కనిపించింది. నెగెటివ్ రోల్‌లో సమంత అదరగొట్టిన సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ మూవీ ఏదంటే?
Samantha | సమంత లైఫ్‌లో సినిమాకు మించిన కష్టాలు ఉన్నాయి. ఒక రకంగా ఆమె జర్నీ చాలా మందికి స్ఫూర్తి. మిడిల్ క్లాస్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దక్షిణాదిలో టాప్ స్టార్‌గా మారింది. ఓ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నాగచైతన్య...ప్రేమ, పెళ్లి... మూడేళ్లకే విడాకులు...మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరం...ఇలా చాలానే ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒకానొక టైమ్‌లో సమంత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రొడ్యూసర్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చి హిట్టు కొట్టింది. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీలో యాక్షన్ రోల్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యింది.
విలన్‌గా...
ఏ మాయ చేశావే నుంచి ఖుషి వరకు గ్లామర్, యాక్షన్ ఒరియెంటెడ్, ఫిమేల్ సెంట్రిక్ ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది సమంత. హీరోయిన్‌గానే కాకుండా ఓ సినిమాలో సమంత విలన్‌గా కూడా నటించింది. తనలోని నెగెటివ్ షేడ్‌ను బయటపెట్టింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
ఏఆర్ మురుగదాస్...
..చియాన్ విక్రమ్ హీరోగా తమిళంలో 10 ఎండ్రాదుకుల్లా పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందింది. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కోలీవుడ్ అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. తెలుగులోనూ 10న పేరుతో ఈ సినిమా రిలీజైంది.
సీక్రెట్...
చియాన్ విక్రమ్, సమంతలకు ఉన్న క్రేజ్‌తో పాటు మురుగదాస్ నిర్మాత కావడంతో రిలీజ్‌కు ముందు 10 ఎండ్రాదుకుల్లా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇందులో సమంత డ్యూయల్ రోల్‌లో నటించింది. విడుదల వరకు మేకర్స్ ఈ విషయం సీక్రెట్‌గా దాచిపెట్టారు. రెండు పాత్రల్లో ఓ క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్‌తో సాగడం గమనార్హం. ఓ ఊచకోత కేసులో ఉరి శిక్ష పడిన ఖైదీగా పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో నటించింది. తన విలనిజంతో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.
డిజాస్టర్...
సమంత క్యారెక్టర్‌లోని ట్విస్ట్ బాగున్నా...మిగిలిన స్టోరీలో కొత్తదనం లేకపోవడం, కామెడీ, థ్రిల్ అనుకున్న స్థాయిలో పండకపోవడంతో టెన్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 20 కోట్లలోపే వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. తెలుగులోనూ రిలీజైన విషయం ఆడియెన్స్‌కు తెలిసేలోపే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



