త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revntha | గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం రేవంత్ మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ

CM Revntha, Governor | లోక్ భవన్(Lok bhavan) లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా భేటీ (Meets) అయ్యారు. ఈ సంద‌ర్భంగా విద్యారంగానికి సంబంధించిన అంశాల‌పై సీఎం గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించారు.

S

News | Published On Apr 19, 2026, 2.49 pm IST

CM Revntha | గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం రేవంత్ మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: లోక్ భవన్(Lok bhavan) లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా భేటీ (Meets) అయ్యారు. ఈ సంద‌ర్భంగా విద్యారంగానికి సంబంధించిన అంశాల‌పై సీఎం గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించారు. జూన్ 12న ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో శుక్లా మంత‌నాలు జ‌రిపారు. ఆయ‌న‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌సిన‌వారిలో ఉన్నారు.

అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ కు సూచించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. కాగా గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణించి, అందుకు త‌గిన‌ చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement