రేవంత్ రెడ్డీ..గుర్తు పెట్టుకో! రెండేళ్లు కాలక్షేపం చేశావ్: కేటీఆర్
ఈ రోజుతో ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్‌కు నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటాఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని నేను భావిస్తా ఉన్నా.
రేవంత్ రెడ్డీ..గుర్తు పెట్టుకో! రెండేళ్లు కాలక్షేపం చేశావ్: కేటీఆర్
డైవర్షన్, సబ్వర్షన్ , పర్వర్షన్...ఇదే కాంగ్రెస్ పాలన
ఇంతకు మించి పాలన కాంగ్రెస్ కు చేతకాదు
ప్రభుత్వం ఆడించినట్టు సిట్ ఆడుతుంది
త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన డైవర్షన్ (Diversion), సబ్వర్షన్ (Subversion), పర్వర్షన్ (Perversion) లా సాగుతున్నదని బీఆర్ ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేయడం, తమ చేతకాని తనాన్ని సబ్వర్ట్ చేయడం, అలాగే పర్వర్ట్ రాజకీయాలు చేయడం..వంటి పద్ధతుల్లో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేసీఆర్ (KCR) నివాసం నందినగర్‌లో ఆదివారం రాత్రి సిట్ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
👉🏿 సిట్ చట్టాన్ని గౌరవించలేదు. కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కెసిఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడించినట్టు ఆడుతున్నా, కెసిఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తిస్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి... ఆయనకు నిజానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పు ఇస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రిసిడెంట్స్ ఉన్నాయి.
👉🏿 కానీ కెసిఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్‌కు సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా, కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు.
👉🏿 ఈ రోజుతో ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్‌కు నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటాఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని నేను భావిస్తా ఉన్నా.
👉🏿 ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలను ప్రజల్లో సృష్టించే విధంగా గత రెండు సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో, ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం.
👉🏿 మీడియా కూడా దయచేసి నా ప్రార్థన. ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుపడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని... నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిజంగానే ఏదైనా తప్పు జరిగి ఉంటే అధికారులు ముందుకు వచ్చి చెప్పొచ్చు.
👉🏿 కేవలం లీకుల మీద ఆధారపడి మరి 'ఇదిగో పులి అంటే అదిగో తోక' అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
👉🏿 కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మెయ్యడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి మొహం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు రెండేళ్లు కాలక్షేపం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



