త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ అంటేనే అవ‌మానాలకు అడ్డా.. కాంగ్రెస్ నిన్ను ద‌ర్జాగా చూసుకుంది: జీవ‌న్‌రెడ్డిపై ఎంపీ చామ‌ల ఫైర్‌

MP Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ అంటేనే అవ‌మానాల‌కు అడ్డా అని.. ఇవాళ జీవ‌న్‌రెడ్డి (Jeevan Reddy) పార్టీ మారుతూ అవ‌మానాల గురించి మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) విమ‌ర్శించారు. ఆయ‌న గులాబీ పార్టీ అవ‌మానాల లిస్టు తీసుకోలేదేమోన‌ని ఎద్దేవా చేశారు.

S

News | Published On Apr 12, 2026, 2.52 pm IST

MP Chamala Kiran Kumar Reddy | బీఆర్ఎస్ అంటేనే అవ‌మానాలకు అడ్డా.. కాంగ్రెస్ నిన్ను ద‌ర్జాగా చూసుకుంది: జీవ‌న్‌రెడ్డిపై ఎంపీ చామ‌ల ఫైర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ అంటేనే అవ‌మానాల‌కు అడ్డా అని.. ఇవాళ జీవ‌న్‌రెడ్డి (Jeevan Reddy) పార్టీ మారుతూ అవ‌మానాల గురించి మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) విమ‌ర్శించారు. ఆయ‌న గులాబీ పార్టీ అవ‌మానాల లిస్టు తీసుకోలేదేమోన‌ని ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఆదివారం స్పందించారు. కేటీఆర్ అమెరికా నుంచి దిగగానే జగిత్యాల వెళ్లార‌ని, బావ హరీశ్‌ రావు మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీఆర్ఎస్ అవమానాల లిస్ట్ చూడకుండా జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 బీ ఫారాలు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో 50 కౌన్సిలర్ స్థానాలు ఉంటే 20 జీవన్ రెడ్డి మనుషులకు ఇచ్చారు. జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవి ఆయ‌న‌ వర్గానికే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని దర్జాగా గౌరవించింది. ఇంత గౌరవంగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ఆరోపణలు చేయడం సరికాదు అని హెచ్చరించారు.

అవ‌మానాలే అవ‌మానానికి గుర‌యిత‌యి...

కేటీఆర్ ఏదో ఒకటి చేయాలని జగిత్యాలకు వెళ్లిన‌వ్‌. ఫ్లైట్ దిగగానే స‌క్క‌గ జీవ‌న్‌రెడ్డి ఇంటికి పోయిన‌వ్‌. మొన్న ఇబ్ర‌హింప‌ట్నం కూడా వెళ్లిన‌వ్‌. మీరు చేసిన అవ‌మానాలు అన్నీ ఇన్నీ కావు. జీవ‌న్‌రెడ్డి ఏమ‌నుకొని బీఆర్ఎస్‌ల‌కు వ‌చ్చిండో , అవ‌మానాల లిస్టు ఆయ‌న చూసుకోలేదేమో. ఫామ్‌హౌస్‌కు వోయి అన్నా న‌న్ను దేవుడే పంపిండే మీ పార్టీల ప‌ని చేయ‌మ‌ని అని కేసీఆర్ ను ఆలింగనం చేసుకుండు. బీఆర్ఎస్ ను చూస్తే అవ‌మానాలే అవ‌మానానికి గుర‌యిత‌యి.

హ‌రీశ్‌రావునే అవ‌మానించిర్రు..

గ‌తంలో బీఆర్ఎస్ లో ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావును కాద‌ని కాంగ్రెస్‌ల గెలిచిన‌ ఉపేంద‌ర్‌రెడ్డిని తీసుకుంటే స‌భ్య‌త్వ న‌మోదు ప‌త్రాలు కూడా ఇవ్వ‌లే. దారుణంగా అవ‌మానించారు. కొల్లాపూర్‌లో జూప‌ల్లి కృష్ణారావు, హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డికి అదే ప‌రిస్థితి ఎదురైంది. గాదే ఇన్న‌య్య‌, న‌రేంద్ర పరిస్థితి ఏమైందో తెలుసు. డిప్యూటీ సీఎంగా రాజ‌య్య‌ను పెట్టి త‌ర్వాత ప‌ద‌వి ఊడ‌గొట్టి అవ‌మానించారు. అంతెందుకు రెండోసారి అధికారంలోకి వ‌చ్చినంక మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా హ‌రీశ్‌రావునే చిన్న‌చూపు చూశారు. క‌విత లిక్క‌ర్ స్కామ్ గురించి ప్ర‌జ‌లు మాట్లాడ‌కుండా ఇంట్లో వాళ్లే మాట్లాడిర్రు. ఇక‌ బీసీ బిడ్డ ఈటెల రాజేంద‌ర్ ప‌రిస్థితి ఏమైందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. తుమ్మ‌ల‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఇలా చెప్పుకొంటూ పోతే బీఆర్ఎస్‌లో అవ‌మానాల‌కు గురైనోళ్లు ఇర‌వై ముప్పై మంది ఉన్న‌రు. అపాయింట్‌మెంట్ దొర‌క్క గేటు కాడ నిల‌వ‌డి తిరిగొచ్చినోళ్లు ఇంకెంత మంది ఉన్న‌రో తెల్వ‌దు. ఇయ్యాళ్ల జీవ‌న్‌రెడ్డి పోయి అవ‌మానాల గురించి మాట్లాడుతుండు అని చామ‌ల‌ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement