త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naveen Aachary | బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల‌తో బీసీల‌కు మోసం: న‌వీన్ ఆచారి

Naveen Aachary | ఐమ్యాక్స్ చౌరస్తా వద్ద పూలే దంపతుల విగ్రహాల(Phule couple statues) ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. పూలే జయంతి రోజుకు కూడా ఆ విగ్రహాలను పూర్తి చేయలేద‌ని తెలంగాణ జాగృతి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. నవీన్ ఆచారి (Naveen Aachary) అన్నారు. రెండు రోజుల క్రితం హడావుడిగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు.

S

News | Published On Apr 11, 2026, 3.49 pm IST

Naveen Aachary | బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల‌తో బీసీల‌కు మోసం: న‌వీన్ ఆచారి
Advertisement
  • జ‌యంతి రోజు వ‌ర‌కూ పూలే దంప‌తుల విగ్ర‌హాలు పెట్ట‌లేదు
  • జ‌య‌శంక‌ర్ సార్‌ను పూర్తిగా మ‌రిచిపోయారు
  • రాజ‌కీయ అవ‌స‌రాల‌కే బీసీలా?
  • అసెంబ్లీలో పూలే విగ్ర‌హం పెట్టాల‌ని క‌విత ఆనాడే అడిగింది
  • కామారెడ్డి బీసీ డిక్ల‌రేష‌న్‌తోనూ కాంగ్రెస్ మోసం
  • లేక్ వ్యూ పార్కు వ‌ద్ద ఆందోళ‌న‌లో న‌వీన్ ఆచారి ధ్వ‌జం

త్రినేత్ర‌.న్యూస్‌: ఐమ్యాక్స్ చౌరస్తా వద్ద పూలే దంపతుల విగ్రహాల(Phule couple statues) ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. పూలే జయంతి రోజుకు కూడా ఆ విగ్రహాలను పూర్తి చేయలేద‌ని తెలంగాణ జాగృతి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. నవీన్ ఆచారి (Naveen Aachary) అన్నారు. రెండు రోజుల క్రితం హడావుడిగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ లేక్ వ్యూ పార్క్ (Lake view park)లోని పూలే విగ్రహ ఏర్పాటు ప్రాంగణంలో జాగృతి నాయ‌కుల‌తో కలిసి ఆయ‌న శ‌నివారం ఆందోళన చేప‌ట్టారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ క‌లిసి బీసీల‌ను మోసం చేస్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రాన్ని సాధించుకొని 13 ఏండ్లు గ‌డుస్తున్నా నేటికీ జయ‌శంక‌ర్ సార్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

గత ప్రభుత్వంలో కూడా కొండా లక్ష్మణ్ బాపుజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో సైబర్ విగ్రహం పెట్టే ప్రయత్నం చేశార‌న్నారు. బీసీ సంఘాలు వ్యతిరేకించటంతో కాంస్య విగ్రహాన్ని తర్వాత ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకొని 13 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బీసీలంటే ఎందుకంత చుల‌క‌నా? అని ప్ర‌శ్నించారు.

ప‌దే ప‌దే మోసం...

బీసీలను అందలం ఎక్కిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కానీ పదే పదే బీసీలను అవమానిస్తూ మోసం చేస్తోంది. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే, సాయిత్రి భాయ్ పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి ఆధ్వర్యంలో కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు పూలే దంపతుల విగ్రహాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. గత ప్రభుత్వమైనా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీసీలను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ పదే పదే అవమానిస్తున్నారు. దీనిపై బీసీలంతా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గతంలో మాదిరిగా బీసీలు లేరు. ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం సిగ్గుపడాలి అని నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అడగటం లేదు. బీసీ ప్రతినిధుల ఫోరమ్ అని ఏర్పాటు చేసి ధర్నాలు, నిరసనలు చేస్తామని చెప్పి ఆ విషయాన్నే పట్టించుకుంటలేరు. రేవంత్ సర్కార్ కులగణనను మొత్తం తప్పుల తడకగా మార్చేసింది. పాలకుల విధానాలను బీసీలంతా ఐక్యంగా ఉండి ఎండగట్టాలి అని న‌వీన్ ఆచారి పిలుపునిచ్చారు.

 

Advertisement
Advertisement