త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU | ఓయూలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి

అంబేద్క‌ర్ (Ambedkar) వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) లో అంసా (AMSA) ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నివాళి అర్పించారు. అనంత‌రం ఆర్ట్స్‌ క‌ళాశాల నుంచి ఎన్‌సీసీ గేటు వ‌ర‌కు 2 కే ర‌న్ (2K Run) నిర్వ‌హించారు.

A

News | Published On Dec 6, 2025, 7.30 am IST

OU | ఓయూలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి
Advertisement

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (Ambedkar) 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ (AMSA) ఓయూ అధ్యక్షులు నామ సైదులు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లో 2కే ర‌న్ (2K Run) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి మాజీ చైర్మన్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, సివిల్ సర్వీసెస్‌ అకాడమీ డైరెక్టర్ డాక్ట‌ర్ కొండ నాగేశ్వరరావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముందుగా అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ర‌న్ కు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తు చేసుకోవడం అంటే భారత రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడమ‌ని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడమంటే ఈ దేశంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోర‌కోడ‌మేన‌న్నారు. అంబేద్కర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక సంబంధం ఉందన్నారు. అంబేద్క‌ర్‌కు గౌర‌వ డాక్ట‌రేట్ అందించిన దేశంలోని మొద‌టి యూనివ‌ర్సిటీగా ఘ‌న‌త ఉస్మానియా యూనివర్సిటీకే దక్కిందన్నారు. అంబేద్కర్ అమరత్వం చెందిన ఈ రోజు మనువాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన రోజని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ దేశంలో కులం, మతం విన్యాసాలకు వ్యతిరేకంగా మనం నిలబడాలంటే మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. ఇటీవ‌ల భారత దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై జరిగిన దాడి ఒక వ్యక్తి పై జరిగిన దాడి కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామిక ప్రేమికులు, లౌకికవాదులపై జరిగిన దాడిగా అభివ‌ర్ణించారు. మనం విడివిడిగా ఉన్నంతకాలం మనపై దాడులు జరుగుతాయి కాబట్టి మనం ఒక్కటై గర్జించినప్పుడే ఈ దాడులను అడ్డుకోగలమ‌ని చెప్పారు. నేడు బుసగొడుతున్న మనువాదాన్ని ఎదుర్కోవడం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు చేయాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సవిన్ సౌడ, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, గ్రూప్ 2 ఆఫీసర్ హరిప్రసాద్, అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల లింగస్వామి, వల్లమల కృష్ణ , జిల్లా మాజీ న్యాయ‌మూర్తి నిమ్మ నారాయణ, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, కొమ్మనబోయిన సైదులు యాదవ్, తాళ్ల అజయ్, మాదాసు రాహుల్, NM శ్రీకాంత్ యాదవ్, విజయ్ నాయక్, ఉప్పల ఉదయ్ కుమార్, లింగ యాదవ్, భారీ అశోక్ యాదవ్, మదునూరి రాహుల్, కరుణ్, ఎనపోతుల అరుణ్ కుమార్, జంగిలి దర్శన్, ఈడుగు రంజిత్, పురం వెంకట్, భూషణ్, శ్రవణ్ యాదవ్, నూకల మధు యాదవ్, క్రాంతి రాజు తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement