త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | హాస్యాస్ప‌దంగా స‌ర్ ప్ర‌క్రియ : ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్

MLC Dasoju Sravan | కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్ ప్ర‌క్రియను హాస్యాస్ప‌దంగా నిర్వ‌హిస్తోంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. స‌ర్ ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌డం లేద‌న్నారు.

S

Telangana | Published On Sep 22, 2026, 3.29 pm IST

MLC Dasoju Sravan | హాస్యాస్ప‌దంగా స‌ర్ ప్ర‌క్రియ : ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్
Advertisement

MLC Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్ ప్ర‌క్రియను హాస్యాస్ప‌దంగా నిర్వ‌హిస్తోంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. స‌ర్ ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌డం లేద‌న్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డిని ఎమ్మెల్సీలు ఎల్ ర‌మ‌ణ‌, దాసోజు శ్ర‌వ‌ణ్‌, మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్, టీజీపీఎస్సీ మాజీ స‌భ్యురాలు సుమిత్రానంద్ క‌లిసి.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట‌ర్ల న‌మోదు షెడ్యూల్‌కు సంబంధించి ప‌లు అభ్యంత‌రాల‌తో విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫైనల్ ఎల‌క్టోరల్ లిస్ట్ రాకముందే గ్రాడ్యుయేట్ ఓటర్‌గా నమోదు చేసుకోమని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. ఇలా చేస్తే గంద‌రగోళం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది. గ్రాడ్యుయేట్ ఓట‌రు న‌మోదు చివ‌రి తేదీని రెండు వారాలు వాయిదా వేయాల‌ని కోరిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటరు సవరణపై చిత్తశుద్ధి లేదు. 90 లక్షల మందికి నోటీసులు ఇచ్చిన స్పందన లేదు.. అందులో 36 లక్షల ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అంటే ఇవి దొంగ ఓట్లా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement