త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trees | ప్ర‌పంచంలో చెట్లే లేని దేశాలు.. అక్క‌డ స‌హ‌జ అడ‌వులు మ‌చ్చుక‌కైనా కాన‌రావు!

Trees | మాన‌వాళి మ‌నుగ‌డ‌కు గాలి, నీరు, భూమి అవ‌స‌రం. మనం నివసించే భూమి సహజ వనరులతో సమృద్ధిగా ఉండే వాటిలో ప్రధానమైనవి చెట్లు (Trees). చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజ‌న్‌ను విడుదల చేస్తాయి.

G

National | Published On May 10, 2026, 8.00 am IST

Trees | ప్ర‌పంచంలో చెట్లే లేని దేశాలు.. అక్క‌డ స‌హ‌జ అడ‌వులు మ‌చ్చుక‌కైనా కాన‌రావు!
Advertisement

Trees | త్రినేత్ర‌.న్యూస్‌: మాన‌వాళి మ‌నుగ‌డ‌కు గాలి, నీరు, భూమి అవ‌స‌రం. మనం నివసించే భూమి సహజ వనరులతో సమృద్ధిగా ఉండే వాటిలో ప్రధానమైనవి చెట్లు (Trees). చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజ‌న్‌ను విడుదల చేస్తాయి. చెట్లు స‌మృద్ధిగా ఉంటేనే వ‌ర్షాలు కురుస్తాయి. చెట్లు లేదా అడవులు లేకపోతే ఏమి జరుగుతుంది? ఊహించ‌డ‌మే క‌ష్టంగా ఉందా?. ప్రపంచంలో సహజ అడవులు (Natural Forests) లేని దేశాలు కూడా ఉన్నాయా?. అంటే ఉన్నాయ‌నే జ‌వాబు వ‌స్తుంది. ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, విప‌రీతంగా మంచు కుర‌వ‌డం, భూమి త‌న సారాన్ని కోల్పోయి ఎడారిగా మార‌డం వంటివి అక్క‌డ‌ చెట్లు పెర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం. ఈ జాబితాలో ఖ‌తార్ (Qatar), గ్రీన్‌లండ్ (Greenland), బ‌హ్రైన్‌, మొనాకో, వాటిక‌న్ సిటీ, కువైట్‌, శాన్ మారినో, మాల్టా, నౌరు, హైతి వంటి దేశాలు ఉన్నాయి.

ఖ‌తార్‌..

ప్ర‌పంచంలోని ఎడారి దేశాల్లో ఇదీ ఒక‌టి. ఇక్క‌డి ఎడారి వాతావర‌ణం వ‌ల్ల స‌హ‌జ‌సిద్ధంగా అడ‌వులు పెర‌గ‌డానికి అవ‌కాశం లేదు. దీంతో కృత్రిమంగా పార్కులు, ఆర్టిఫిషియ‌ల్ గ్రీన్ ఏరియాలు కాన‌రావు. అయితే సహజ అడవులు లేన‌ప్ప‌టికీ, ఆ దేశ ప్రజలు తమ వద్ద ఉన్న వనరులను ఉపయోగించి కృత్రిమ అడవిని సృష్టించుకున్నారు. ఇక్క‌డ సహజ సిద్ధమైన అడవులు లేదా చెట్ల విస్తీర్ణం 0 శాతం.

గ్రీన్‌లాండ్

పేరులో `గ్రీన్` ఉన్నప్ప‌టికీ ఇక్క‌డ స‌హ‌జ అడ‌వులు మ‌చ్చుకు కూడా కాన‌రావు. ఏడాదిలో చాలా భాగం తీవ్ర‌మైన చ‌లి ఉంటుంది. భూభాగం మొత్తం మంచుతో కప్పబడి ఉండటంతో సహజ అడవులు పెర‌గ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింది. స‌ముద్ర తీర ప్రాంతాల్లో అక్క‌డ‌క్క‌డ వేస‌వి స‌మయంలో ప‌చ్చిక‌బ‌య‌ళ్లు, చిన్న‌చిన్న పొద‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి.

బ‌హ్రైన్‌

ఎడాది దేశ‌మైన బ‌హ్రైన్‌లో కూడా స‌హ‌జ అడ‌వులు క‌నిపించ‌వు. పొడ‌వైన చెట్లు బ‌త‌క‌డానికి ఇక్క‌డి వాతావ‌ర‌ణం, ఉప్పుతో కూడిన భూమి ప్ర‌తిబంధ‌కంగా మారాయి. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్టులు, నీటిపారుద‌ల వ్య‌వ‌స్థ‌ల ద్వారా దేశంలో ప‌చ్చ‌ద‌నాన్ని సృష్టిస్తున్నారు.

మొనాకో

ప్ర‌పంచంలో అతిచిన్న దేశం. పైగా పూర్తిగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ చెందిన ప్రాంతం. ఎక్క‌డ చూసినా భ‌వ‌నాలు, రోడ్లు, ల‌గ్జ‌రీ డెవ‌ల‌ప్‌మెంట్ వ‌ల్ల ఇక్క‌డ స‌హ‌జంగా చెట్లు పెర‌గ‌వు. ఈనేప‌థ్యంలో అర్బ‌న్ గ్రీన‌రీ, డెక‌రేటివ్ గార్డెన్ అభివృద్ధిపై ప్ర‌భుత్వాలు దృష్టి సారించాయి.

వాటిక‌న్ సిటి

ఇది ఒక న‌గ‌ర రాజ్యం. ఇక్క‌డి 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్క సహజమైన చెట్లూ లేవు, ఎందుకంటే అది సెయింట్ పీటర్స్, తోటలతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. పూర్తిగా పట్టణ కేంద్రం కావ‌డం, ప‌విత్ర స్థలాలు, భ‌వ‌నాల మధ్య అడవులకు చోటు లేకుండా పోయింది. ఇక్క‌డ పచ్చదనం అంతా కృత్రిమ‌మైన‌దే.

శాన్ మారినో, మొనాకో: ఇవి చాలా చిన్న యూరోపియన్ దేశాలు, పట్టణీకరణ కారణంగా అటవీ ప్రాంతం లేదు.

కువైట్, మాల్టా: ఇవి కూడా చాలా తక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న దేశాలు.

నౌరు: ఈ చిన్న ద్వీప దేశంలో ఫాస్ఫేట్ తవ్వకాల వల్ల అడవులు పూర్తిగా నశించాయి.

Advertisement
Advertisement