త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | కేబీఆర్ పార్కు వ‌ద్ద చెట్ల‌ను కొట్టేయొద్దు: సుప్రీం కీల‌క‌ ఆదేశాలు

Supreme Court | బీఆర్‌ పార్క్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని ఉత్త‌ర్వులిచ్చింది.

S

Hyderabad | Published On May 18, 2026, 2.49 pm IST

Supreme Court | కేబీఆర్ పార్కు వ‌ద్ద చెట్ల‌ను కొట్టేయొద్దు: సుప్రీం కీల‌క‌ ఆదేశాలు
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్: కేబీఆర్‌ పార్క్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని ఉత్త‌ర్వులిచ్చింది. పార్క్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణంపై నేడు విచార‌ణ చేపట్టిన‌ సుప్రీంకోర్టు తదుపరి తీర్పు ఇచ్చే వ‌ర‌కు పార్క్‌కు 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది.

చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇటీవ‌ల‌ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. పర్యావరణ ప్రేమికుల తరఫున కోర్టులో సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం స్టే ఆర్డర్ జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది.

ఎస్‌ఆర్‌డీపీ (SRDP - Strategic Road Development Plan) పేరిట హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన విష‌యం విదిత‌మే. ఈ క్రమంలోనే కేబీఆర్‌ పార్క్‌ వద్ద నిర్మాణలకు సంక‌ల్పించింది. అండర్‌పాస్‌ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ డైవర్షన్లను సైతం విధించారు. సుప్రీంకోర్టు స్టేతో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఆ పనులు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి.

Advertisement
Advertisement