త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | లోపాల ప‌రంప‌ర‌కు ముగింపు ప‌ల‌కాలి.. పేపర్ లీక్‌పై కేంద్రానికి సుప్రీం కీల‌క ఆదేశాలు

Supreme Court | నీట్ (NEET) పేపర్ లీక్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ ప‌రిస్థితిని ఇంకా కొన‌సాగించ‌లేమ‌ని వ్యాఖ్యానించింది. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని కేంద్రం, నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది.

D

National | Published On Jul 24, 2026, 1.11 pm IST

Supreme Court | లోపాల ప‌రంప‌ర‌కు ముగింపు ప‌ల‌కాలి.. పేపర్ లీక్‌పై కేంద్రానికి సుప్రీం కీల‌క ఆదేశాలు
Advertisement

Supreme Court | నీట్ (NEET) పేపర్ లీక్ (NEET paper leak) విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో లోపాల ప‌రంప‌ర‌కు ముగింపు ప‌ల‌కాల‌ని ఆదేశించింది. ఇలాంటి లోపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ ప‌రిస్థితిని ఇంకా కొన‌సాగించ‌లేమ‌ని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని తాము చాలా నిశితంగా పరిశీలిస్తామని, క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.

అదేస‌మ‌యంలో ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ఆన్‌లైన్ విధానానికి మార్చ‌డానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. డేటా భద్రతను ఎలా కాపాడతారని ప్రశ్నించింది. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం కేంద్రం, నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది.

కేంద్రం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా (Tushar Mehta) స్పందిస్తూ.. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ధ‌ర్మాస‌నానికి తెలిపారు. స‌మ‌గ్ర నివేదిక‌ను కోర్టు ముందు ఉంచేందుకు కొంత స‌మ‌యం కావాల‌ని కోరారు. వాద‌న‌లు విన్న కోర్టు విచార‌ణ‌ను ఈనెల 27కు వాయిదా వేసింది.

Advertisement
Advertisement