త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sikkim Sundari | దశాబ్దాలకు ఒక్కసారే పూస్తుంది.. ఆ వెంటనే చనిపోతుంది.. సిక్కిం సుందరి ప్రత్యేకత తెలిస్తే ఫిదా కావాల్సిందే..!

Sikkim Sundari | తూర్పు హిమాలయాల్లోని ఎత్తయిన, చలిగాలులతో కూడిన ప్రాంతాల్లో అరుదుగా కనిపించే పుష్పం ఉంది. దాన్ని స్థానికులు సిక్కిం సుందరి అని పిలుస్తారు.

S

National | Published On Dec 30, 2025, 7.30 am IST

Sikkim Sundari | దశాబ్దాలకు ఒక్కసారే పూస్తుంది.. ఆ వెంటనే చనిపోతుంది.. సిక్కిం సుందరి ప్రత్యేకత తెలిస్తే ఫిదా కావాల్సిందే..!
Advertisement

Sikkim Sundari | తూర్పు హిమాలయాల్లోని ఎత్తయిన, చలిగాలులతో కూడిన ప్రాంతాల్లో అరుదుగా కనిపించే పుష్పం ఉంది. దాన్ని స్థానికులు సిక్కిం సుందరి అని పిలుస్తారు. అయితే ఈ మొక్కను శాస్త్రీయంగా రూమ్ నోబైల్ అని పిలుస్తారు. సిక్కిం రాష్ట్రానికి చెందిన దీన్ని అత్యంత అరుదైన వృక్ష సంపదగా భావిస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌మీడియాలో దీని గురించి ప్రస్తావించడంతో సిక్కిం సుందరి వైరల్‌గా మారింది. ఓర్పునకు ప్రతీకగా దీన్ని అభివర్ణించడంతో ఈ పువ్వు గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సిక్కిం సుందరి సముద్ర మట్టానికి సుమారు 4,000 నుంచి 4,800 మీటర్ల ఎత్తులో మాత్రమే పెరుగుతుంది. దీనిని గ్లాస్‌హౌస్ ప్లాంట్ వర్గానికి చెందినదిగా శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ మొక్కపై ఉండే పొడవైన, పారదర్శక కవచాల లాంటి ఆకులు లోపలి పుష్పాలను తీవ్రమైన చలి, బలమైన గాలులు, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి. ఈ మొక్కకలు హిమాలయ పర్వతాల్లో వెలుగుతున్న దీపస్తంభాల్లా మెరుస్తుంటాయి.

సిక్కిం సుందరి జీవిత చక్రం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మోనోకార్పిక్ మొక్క. అంటే జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పూస్తుంది. ఏడు నుంచి 30 ఏళ్ల వరకు నేలకు దగ్గరగా చిన్న ఆకుల సమూహంగా కనిపిస్తుంది. అయితే ఉన్నట్టుండి ఇది ఒక్కసారిగా రెండు మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. పగోడా ఆకారంలో పుష్పించి, విత్తనాలను వెదజల్లిన అనంతరం ఇది చనిపోతుంది. అందుకే దీన్ని ఓర్పు, త్యాగానికి అద్భుతమైన ఉదాహరణగా చెబుతారు.

ఉత్తర సిక్కింలోని ఎత్తయిన ట్రెక్కింగ్ మార్గాలు, హిమానద లోయల వద్ద ఈ మొక్క కనిపిస్తుంటుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల దీన్ని అరుదుగా చూడవచ్చు. అందుకే ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు దీన్ని చూడటం జీవితంలో ఒక్కసారే దక్కే అనుభూతిగా భావిస్తారు. పూర్వం దీన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారట. జీర్ణక్రియ, వాపు, కాలేయం, నొప్పి సంబంధిత సమస్యలకు ఈ మొక్క చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని కాండాలను ఆహారంగా తీసుకుంటారు. వేర్లను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. అంత అరుదైనది కాబట్టే దీన్ని దూరం నుంచే చూడాలి తప్ప.. తాకకూడదని స్థానికులు చెబుతుంటారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement