Raghu Rai | ప్రఖ్యాత ఫొటోజర్నలిస్ట్ రఘురాయ్ కన్నుమూత..
Raghu Rai | ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ (Raghu Rai) కన్నుమూశారు. దశాబ్దాల పాటు ఎన్నో చారిత్రక ఘట్టాలను, విషాదాలను, విజయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘భారత ఫొటో జర్నలిజం పితామహుడు’ రఘు రాయ్ (83) ఆదివారం తుదిశ్వాస విడిచారు.
Raghu Rai | త్రినేత్ర.న్యూస్: ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ (Raghu Rai) కన్నుమూశారు. దశాబ్దాల పాటు ఎన్నో చారిత్రక ఘట్టాలను, విషాదాలను, విజయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘భారత ఫొటో జర్నలిజం పితామహుడు’ రఘు రాయ్ (83) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం నివాళులు అర్పించింది.

ఛాయాచిత్ర రంగానికి ఒక సముచితమైన స్థానం కల్పించి పద్మశ్రీ అవార్డును పొందిన రఘు రాయ్.. ఒక విలక్షణమైన ఫోటోగ్రాఫర్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ల సరసన చేరారని తెలిపింది. ఆయన మరణ వార్త ఫోటోగ్రఫీ రంగానికి ఒక తీర్చలేని లోటని, పూడ్చలేని అగాధంగా పేర్కొంది.

చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి..
83 ఏండ్ల రఘు రాయ్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. సామాన్యులతోపాటు మదర్ థెరిసా, దలైలామా, ఇందిరా గాంధీ, శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే, ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే వంటి ఎందరో ప్రముఖుల ఫొటోలను తన కెమెరాలో బంధించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఆయన తీసిన ఛాయాచిత్రాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. సగం పూడ్చిపెట్టిన ఒక చిన్నారి కళ్లలోని విషాదాన్ని ఆయన బంధించిన తీరు, ఆ దుర్ఘటన తీవ్రతను కళ్లకు కట్టింది.

23వ ఏట..
1942, డిసెంబర్ 18న పంజాబ్‌లోని ఝంగ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించిన రఘు రాయ్ తన 23వ ఏట కెమెరా చేతపట్టారు. 1962లో ‘ది స్టేట్స్‌మన్’ పత్రికతో ఫొటోజర్నలిస్టుగా (photojournalist) వృత్తిని ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత ‘మాగ్నమ్ ఫోటోస్’లో సభ్యునిగా ఎదిగారు. `ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫొటోజర్నలిజం`గా గుర్తింపు పొందారు. 18కి పైగా పుస్తకాలు రచించిన ఆయన, వరల్డ్ ప్రెస్ ఫొటో పోటీలకు మూడుసార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




