త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Char Dham Yatra | బద్రీనాథ్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్‌.. భ‌క్తుల‌కు తీవ్ర అవ‌స్థ‌లు..!

Char Dham Yatra | చమోలి జిల్లా బద్రీనాథ్‌కు వెళ్లే చార్ ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోషీమఠ్–మార్వారీ మధ్య భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా భక్తులు గంటల తరబడి రోడ్డుపైనే నిరీక్షించాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంది.

P

National | Published On May 30, 2026, 6.51 pm IST

Char Dham Yatra | బద్రీనాథ్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్‌.. భ‌క్తుల‌కు తీవ్ర అవ‌స్థ‌లు..!
Advertisement

Char Dham Yatra | చమోలి జిల్లా బద్రీనాథ్‌కు వెళ్లే చార్ ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోషీమఠ్–మార్వారీ మధ్య భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా భక్తులు గంటల తరబడి రోడ్డుపైనే నిరీక్షించాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్ వైర‌ల్‌గా మారాయి. ‘జీరో బ్యాండ్’ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ప్రారంభమైన ట్రాఫిక్ రద్దీ, రోజంతా కొనసాగి రాత్రి వరకు కూడా త‌గ్గ‌లేదు. గ‌త మూడురోజులు ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుండ‌డంత ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులుప‌డుతున్నారు.

రోడ్లపై వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోవడం, సుదీర్ఘ స‌మ‌యం పాటు వాహ‌నాలు నిలిచిపోవ‌డంతో తాగునీరు, ఆహారం త‌దిత‌ర క‌నీస అవ‌స‌రాలు అంద‌క క‌ష్టాలు ప‌డ్డారు. పోలీసులు, అధికారులు సైతం రోడ్ల‌పైకి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. హేమకుండ్ సాహిబ్ యాత్ర ప్రారంభమైన తర్వాత యాత్రికుల రద్దీ మరింత పెరిగింది. అదే సమయంలో వాహనాలు ఎక్కువ‌గా వ‌స్తుండ‌డంతో ఒత్తిడి పెరిగి ప‌రిస్థితి అదుపు త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జోషిమఠ్‌లో అధికారులు గేట్ సిస్టమ్‌తో పాటు వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేశారు.

ఈ విధానం ప్రకారం.. ఒకేసారి ఒక దిశలో మాత్రమే వాహనాలను అనుమ‌తించ‌నున్నారు. ఎదురుదిశలో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. రెండు వైపుల వాహనాల రాకపోకలను 30 నిమిషాల పాటు ప్రత్యామ్నాయంగా అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ యాత్రలు కొంతమేర సాఫీగా సాగుతాయని భావిస్తున్నారు. “ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు గేట్ సిస్టమ్ అమలు చేశాం. రెండు వైపుల నుంచి 30 నిమిషాల వ్యవధిలో వాహనాలను అనుమతించి ట్రాఫిక్‌ను సాఫీగా కొనసాగిస్తాం” అని జోషీమఠ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ వశిష్ఠ వివ‌రించారు.

Advertisement
Advertisement