త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

విషాదం.. లక్షల విలువైన పెంపుడు చిలుకను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యజమాని

విద్యుత్ స్తంభంపై చిక్కుకున్న తన చిలుకను రక్షించేందుకు ప్రయత్నించిన యజమాని ఆ స్తంభం పైన ఉన్న కరెంట్ వైర్లను తాకి విద్యుత్ షాక్‌కి గురై ప్రాణాలు కోల్పోయాడు.

J

National | Published On Dec 13, 2025, 3.46 pm IST

విషాదం.. లక్షల విలువైన పెంపుడు చిలుకను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యజమాని
Advertisement

ఎంతో ప్రేమగా, అపురూపంగా పెంచుకుంటున్న పెంపుడు చిలుకను కాపాడబోయిన ఓ వ్యక్తి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభంపై చిక్కుకున్న తన చిలుకను రక్షించేందుకు ప్రయత్నించిన యజమాని ఆ స్తంభం పైన ఉన్న కరెంట్ వైర్లను తాకి విద్యుత్ షాక్‌కి గురై ప్రాణాలు కోల్పోయాడు.

గిరినగర్‌లో ఉంటున్న అరుణ్ కుమార్ అరుదైన జాతి మెకావ్‌కి చెందిన చిలుకను పెంచుకుంటున్నాడు. దాని విలువ సుమారు రూ.2.5 లక్షలు ఉంటుంది. ఆ పక్షి అనుకోకుండా ఇంట్లో నుంచి బయటికి ఎగిరిపోయి ఓ విద్యుత్ స్తంభం మీద కూర్చొంది. అది హైటెన్షన్ లైన్. దానికి ఎక్కడ విద్యుత్ తీగలు తగులుతాయో అని భయపడి ఓ ఐరన్ రాడ్ పట్టుకొని పక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ ఎక్కాడు. దాన్ని రాడ్ సాయంతో కిందికి వెళ్లగొట్టాలని భావించి రాడ్ ను దాని దగ్గరికి పంపించే క్రమంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లకు రాడ్ తాకింది. అది ఐరన్ రాడ్ అవడం వల్ల క్షణాల్లో అరుణ్ కుమార్‌కు కరెంట్ షాక్ కొట్టడంతో వెంటనే కింద కుప్పకూలిపోయాడు.

వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే అరుణ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement