EC | సీనియర్ అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు.. పట్టించుకోని కేబినెట్ కార్యదర్శి
EC | భారత ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (DEC) మనీశ్ గార్గ్ (Maneesh Garg) వ్యవహారశైలిని తప్పుబడుతూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (ECs) సుఖ్‌బీర్ సింగ్ సంధు (Sukhbir Singh Sandhu), వివేక్ జోషి (Vivek Joshi) స్వయంగా ఫిర్యాదు చేయగా.. దానిపై కేబినెట్ కార్యదర్శికి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
EC | త్రినేత్ర న్యూస్ : భారత ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (DEC) మనీశ్ గార్గ్ (Maneesh Garg) వ్యవహారశైలిని తప్పుబడుతూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (ECs) సుఖ్‌బీర్ సింగ్ సంధు (Sukhbir Singh Sandhu), వివేక్ జోషి (Vivek Joshi) స్వయంగా కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు (Cabinet Secretary TV Somanathan) వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది. ఈ ఏడాది జులై 29న ఎన్నికల కమిషనర్లు లేఖలు రాసినట్లు తేలింది. అయితే, ఈసీల ఫిర్యాదులపై కేబినెట్ కార్యదర్శి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భాను ప్రకాష్ ఏతురు సెలవులో ఉన్న సమయంలో జులై 28న అడ్మినిస్ట్రేషన్ విభాగం అదనపు బాధ్యతలను మనీశ్ గార్గ్‌కు అప్పగించారు. ఆ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఆయన సీనియర్ డిప్యూటీ ఈసీలు, డీఈఈలు, డైరెక్టర్ జనరల్స్ వంటి ఉన్నతాధికారుల పని విభజనను మారుస్తూ ఓ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో గార్గ్ తమతో గానీ, సంబంధిత అధికారులతో గానీ ముందస్తుగా ఎలాంటి చర్చలూ జరపకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారని కమిషనర్లు ఆరోపించారు. కమిషన్ ఆమోదం లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని గతంలో తాము స్పష్టమైన రాతపూర్వక ఆదేశాలు ఇచ్చినప్పటికీ గార్గ్ వాటిని బేఖాతరు చేశారని పేర్కొన్నారు. ఇది 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను తాను అడగ్గా ఇవ్వడానికి నిరాకరించారని వివేక్ జోషీ తన లేఖలో ఆరోపించారు.
కేబినెట్ సెక్రటేరియట్ ఏమన్నదంటే..?
అయితే, ఈ ఫిర్యాదులపై నేరుగా చర్యలు తీసుకునేందుకు కేబినెట్ సెక్రటేరియట్ నిరాకరించింది. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని, దాని వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోరాదని ఆర్టీఐ ద్వారా వెలువడిన పత్రాల్లో కేబినెట్ సెక్రటేరియట్ తెలిపింది. ఎన్నికల సంఘం తరఫున అధికారికంగా ఫిర్యాదు అందలేదని, ఇద్దరు కమిషనర్లు వ్యక్తిగత హోదాల్లో లేఖలు పంపారని స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో మనీష్ గార్గ్‌కు సంబంధించిన నిర్ణయాల సమయంలో పరిగణనలోకి తీసుకునేలా వాటిని రికార్డుల్లోకి తీసుకుంటూ.. ఆగస్టు 5న కేబినెట్ కార్యదర్శి ఇద్దరు కమిషనర్లకు సమాధానాలు పంపారు. సంబంధిత కాపీలను సీఈసీ కార్యాలయాని కూడా పంపినట్లు వెల్లడైంది. కాగా, ఓటర్ల జాబితా నమోదు, తొలగింపు వంటి అంశాలపై కూడా గతంలో కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read..
చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు.. లేడీ సింగం అంకితా శర్మకు పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు
సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానం.. తగ్గనున్న ఖర్చుల భారం!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టులో సవాల్
అక్టోబర్ 8, 2026

SIR నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసన డిమాండ్ దాకా.. ఏం జరిగింది?
సెప్టెంబర్ 26, 2026

Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Ankita Sharm | చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌లో కాల్పులు.. లేడీ సింగం అంకితా శర్మకు పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు
- ●Gas Leak | సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి
- ●Telangana | ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానం.. తగ్గనున్న ఖర్చుల భారం!
- ●Kukatpally | దోమల నివారణకు పొగ వేస్తే.. మంటలు చెలరేగి కాలి బూడిదైన గుడిసెలు
- ●Tibet | టిబెట్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి, కూలిన 300కుపైగా ఇండ్లు
- ●ICICI Bank | ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్, ఉపసంహరణ చార్జీల పెంపు

Ankita Sharm | చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌లో కాల్పులు.. లేడీ సింగం అంకితా శర్మకు పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు

Gas Leak | సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

Telangana | ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానం.. తగ్గనున్న ఖర్చుల భారం!

Kukatpally | దోమల నివారణకు పొగ వేస్తే.. మంటలు చెలరేగి కాలి బూడిదైన గుడిసెలు



