India-Brazil 10 year Visas | బ్రెజిల్‌కి వెళ్తారా? ఒక్కసారి వీసా తీసుకుంటే 10 ఏళ్ల వాలిడిటీ.. ఎన్నిసార్లు అయినా వెళ్లొచ్చు
ఒక్కసారి వీసా తీసుకుంటే పదేళ్లలో ఎన్నిసార్లు అయినా అదే వీసా మీద ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రస్తుతం తీసుకున్న వీసా పెంపు నిర్ణయం వల్ల ఇరు దేశాల పౌరులకు లబ్ధి చేకూరనుంది.
India-Brazil 10 year Visas | భారత్ నుంచి దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌కి వెళ్లాలనుకునే వారికి ఇరు దేశాలు శుభవార్త చెప్పాయి. బిజినెస్ పని మీద లేదంటే బ్రెజిల్‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు టూరిస్టుగా వెళ్లాలన్నా ఇక నుంచి వీసా పొందడం మరింత సులువు కానుంది. అంతే కాదు.. ఇప్పటి వరకు భారత్, బ్రెజిల్ మధ్య ఉన్న వీసా కాలం 5 ఏళ్లను ఇరు దేశాలు 10 ఏళ్లకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. టూరిస్ట్, బిజినెస్ వీసాలు ఏవైనా ఇక నుంచి పదేళ్ల వాలిడిటీని కలిగి ఉంటాయి.
ఇరు దేశాల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు, రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల మధ్య ప్రజల సంబంధాలను మెరుగు పరిచేందుకు ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు దేశాల పౌరులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలు పదేళ్ల పాటు వాలిడిటీతో అందుబాటులోకి రానున్నాయి. టూరిజం, బిజినెస్ ట్రావెల్‌ను పెంచేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని ఇరు దేశాలు స్పష్టం చేశాయి.
ఒక్కసారి విజిట్ చేస్తే 90 రోజుల వరకు స్టే
టూరిస్ట్, బిజినెస్ వీసా వాలిడిటీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచినా.. ఇతర రూల్స్ మాత్రం అవే ఉంటాయి. సాధారణంగా టూరిస్టు వీసా మీద బ్రెజిల్ వెళ్తే 90 రోజుల వరకు మాత్రమే అక్కడ ఉండాల్సి ఉంటుంది. బిజినెస్ వీసా అయితే 180 రోజుల వరకు అక్కడ ఉండొచ్చు. ఆ దేశ ఇమ్రిగేషన్ చట్టం ప్రకారం వీసా నిబంధనలు వర్తించనున్నాయి.
కాకపోతే ఒక్కసారి వీసా తీసుకుంటే పదేళ్లలో ఎన్నిసార్లు అయినా అదే వీసా మీద ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రస్తుతం తీసుకున్న వీసా పెంపు నిర్ణయం వల్ల ఇరు దేశాల పౌరులకు లబ్ధి చేకూరనుంది.
న్యూఢిల్లీ, బ్రెజిల్ మధ్య ట్రేడ్, పెట్టుబడుల బంధాన్ని మరింత బలోపేతం చేసి ఇరు దేశాల టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు పడటం ఇరు దేశాలకు ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. వచ్చే 30 రోజుల్లో ఈ వీసా కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



