త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | డీలిమిటేష‌న్.. ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చ‌ర్య : అస‌దుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi | కేంద్ర ప్ర‌భుత్వం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన డీలిమిటేష‌న్ బిల్లును హైద‌రాబాద్ ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్య‌తిరేకించారు.

S

National | Published On Apr 16, 2026, 3.15 pm IST

Asaduddin Owaisi | డీలిమిటేష‌న్.. ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చ‌ర్య : అస‌దుద్దీన్ ఓవైసీ
Advertisement

Asaduddin Owaisi | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర ప్ర‌భుత్వం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన డీలిమిటేష‌న్ బిల్లును హైద‌రాబాద్ ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ బిల్లుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్ర‌వేశ‌పెట్టి చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ ఓవైసీ మాట్లాడుతూ.. ఈ బిల్లును పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.ఈ బిల్లు స‌మాఖ్య‌వాదాన్ని దెబ్బ‌తీస్తుంద‌న్నారు. ఈ చ‌ర్య మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించింది కాద‌ని, ఇది ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చ‌ర్య అని ఓవైసీ మండిప‌డ్డారు. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల‌కు డీలిమిటేష‌న్ బిల్లు మ‌రింత అధికారాన్ని ఇస్తుంద‌న్నారు. దక్షిణాది రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

డీలిమిటేష‌న్ బిల్లు వ‌ల్ల రాజ్యాంగ మౌలిక స్వ‌రూపానికి భంగం క‌లిగిస్తుంది. జ‌నాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల‌కు ఎక్కువ సీట్లు ల‌భిస్తాయి. దీంతో చిన్న రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం లేకుండా పోతుంద‌న్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల‌కు కేటాయించే సీట్ల శాతం 38.1 నుంచి 43.1 శాతానికి పెరిగే అవ‌కాశం ఉంది. అదే స‌మ‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ప్ర‌స్తుతం ఉన్న 24 శాతం నుంచి 20 శాతానికి త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని ఓవైసీ పేర్కొన్నారు. ఇక మ‌హిళా బిల్లుకు నిర‌స‌న‌గా సాహిర్ లుధియాన్వి రాసిన ఓ క‌విత‌ను ఓవైసీ స‌భ‌లో చ‌దివి వినిపించారు.

Advertisement
Advertisement