త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cardiac Arrest | గోల్డ్ షాపులో గుండెపోటు.. సీపీఆర్‌తో ఊపిరి.. వీడియో

Cardiac Arrest | గోల్డ్ షాపుకెళ్లిన ఓ 60 ఏండ్ల జెమ్‌స్టోన్ వ్యాపారి( gemstone trader ) గుండెపోటు( Cardiac Arrest )కు గుర‌య్యాడు. ఆ పెద్ద మ‌నిషికి రెండున్న‌ర నిమిషాల పాటు సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలు కాపాడాడు షాపు య‌జ‌మాని కుమారుడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌( Rajasthan )లోని కోటా( Kota )లో డిసెంబ‌ర్ 11వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

S

National | Published On Dec 15, 2025, 5.26 pm IST

Cardiac Arrest | గోల్డ్ షాపులో గుండెపోటు.. సీపీఆర్‌తో ఊపిరి.. వీడియో
Advertisement

Cardiac Arrest | గోల్డ్ షాపుకెళ్లిన ఓ 60 ఏండ్ల జెమ్‌స్టోన్ వ్యాపారి( gemstone trader ) గుండెపోటు( Cardiac Arrest )కు గుర‌య్యాడు. ఆ పెద్ద మ‌నిషికి రెండున్న‌ర నిమిషాల పాటు సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలు కాపాడాడు షాపు య‌జ‌మాని కుమారుడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌( Rajasthan )లోని కోటా( Kota )లో డిసెంబ‌ర్ 11వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కోటాలోని రామ‌పుర బ‌జార్‌లో వ‌ర్ధ‌మాన్ జ్యువెల‌ర్స్ అనే దుకాణాన్ని విమ‌ల్ కుమార్ జైన్ నిర్వ‌హిస్తున్నాడు. అయితే డిసెంబర్ 11వ తేదీన జెమ్‌స్టోన్ వ్యాపారి రాజ్‌కుమార్ సోని(60) వ‌ర్ధ‌మాన్ జ్యువెల‌ర్స్ దుకాణానికి వ‌చ్చాడు. ఇక కుర్చీలో కూర్చున్న వ్యాపారి ఉన్న‌ట్టుండి ప‌డిపోయాడు.

అప్ర‌మ‌త్త‌మైన విమ‌ల్ కుమార్ జైన్ కుమారుడు వ‌రుణ్ జైన్‌(32) చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాడు. రాజ్ కుమార్ స్పృహ కోల్పోవ‌డంతో ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. నేల‌పై ప‌డుకోబెట్టి సీపీఆర్ చేశాడు. రెండున్న‌ర నిమిషాల పాటు సీపీఆర్ చేసిన త‌ర్వాత‌.. వ్యాపారికి స్పృహ వ‌చ్చింది. దీంతో బంగారం షాపు య‌జ‌మానులు, వ‌ర్క‌ర్లు ఊపిరి పీల్చుకున్నారు. అనంత‌రం మెరుగైన చికిత్స నిమిత్తం రాజ్‌కుమార్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

రాజ్‌కుమార్ సోని ప్ర‌తి రోజు కోటా నుంచి జైపూర్‌కు ప్ర‌యాణిస్తుంటాడు. ఇక వ్యాపారి గుండెపోటుకు గురైన దృశ్యాలు బంగారం షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వ్యాపారి ప్రాణాలు కాపాడిన వ‌రుణ్ జైన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. స‌మ‌యానికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వ‌రుణ్‌కు ప‌లువురు హ్యాట్సాఫ్ చెప్పారు. గ్రేట్ వ‌ర్క్ అని మ‌రికొంద‌రు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement