CBSE Class 10 Result 2026 | పదో తరగతి ఫలితాలు విడుదల.. 93 శాతం మంది పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..!
సీబీఎస్ఈ రెండు బోర్డ్ పరీక్షల విధానాన్ని తీసుకొచ్చింది. సెషన్ 1, సెషన్ 2 పేరుతో రెండు సార్లు పరీక్షలను నిర్వహిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సిఫారసు మేరకు 2025 నుంచి ఈ విధానాన్ని సీబీఎస్ఈ బోర్డు అనుసరిస్తోంది. సెషన్ 1 లో భాగంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పరీక్షలు జరుగగా, రెండో దఫా పరీక్షలు మే 2026 లో నిర్వహించనున్నారు.
CBSE Class 10 Result 2026 | సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. 93.70 శాతం మంది విద్యార్థులు సెషన్ వన్ ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలికలదే పైచేయిగా నిలిచింది. 94.99 శాతంతో బాలికలు తొలిస్థానంలో నిలవగా, 92.6 శాతంతో బాలురు రెండో స్థానానికి పరిమితమయ్యారు. సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి 2026 రిజల్ట్స్‌ని cbse.gov.in లేదా results.cbse.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. లేదంటే ఉమంగ్ (UMANG) యాప్, డిజిలాకర్ యాప్‌లోకి లాగిన్ అయి రిజల్ట్స్ చూడొచ్చు.
ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన పరీక్షలు
సీబీఎస్ఈ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలను ఫిబ్రవరి 17, 2026 నుంచి మార్చి 11, 2026 వరకు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకోవాలంటే.. వాళ్ల రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్ కార్డు ఐడీ, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ లాంటి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని వివరాలు కరెక్ట్‌గా ఇస్తేనే ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
రెండు బోర్డు ఎగ్జామ్స్
సీబీఎస్ఈ రెండు బోర్డ్ పరీక్షల విధానాన్ని తీసుకొచ్చింది. సెషన్ 1, సెషన్ 2 పేరుతో రెండు సార్లు పరీక్షలను నిర్వహిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సిఫారసు మేరకు 2025 నుంచి ఈ విధానాన్ని సీబీఎస్ఈ బోర్డు అనుసరిస్తోంది. సెషన్ 1 లో భాగంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పరీక్షలు జరుగగా, రెండో దఫా పరీక్షలు మే 2026 లో నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



