త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhishek Banerjee | టీఎంసీ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీస్ కూల్చివేత

Abhishek Banerjee | ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీసును అధికారులు తాజాగా కూల్చివేశారు. ఆ బిల్డింగ్ అక్ర‌మంగా నిర్మించిన‌ట్లు తేల‌డంతో చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు.

D

National | Published On Jul 18, 2026, 5.37 pm IST

Abhishek Banerjee | టీఎంసీ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీస్ కూల్చివేత
Advertisement

Abhishek Banerjee | అక్ర‌మ నిర్మాణాల‌పై ప‌శ్చిమ బెంగాల్‌లోని సువేందు అధికారి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అడ్డ‌గోలుగా నిర్మించిన భ‌వ‌నాల‌ను బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తోంది. తాజాగా సౌత్ 24 ప‌ర‌గ‌ణాల‌ జిల్లాలోని అమ్తాలా (Amtala)లో తృణ‌మూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీసును అధికారులు తాజాగా కూల్చివేశారు.

ఎలాంటి బిల్డింగ్ ప్లాన్ ఆమోదం లేకుండానే ఈ ఐదు అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించార‌ని అధికారులు తెలిపారు. బిల్డింగ్ రూల్స్ ఉల్లంఘన జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు. అందుకే చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. బిల్డింగ్ కూల్చివేత నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ప్ర‌భుత్వం భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాలు, బెంగాల్ పోలీసు సిబ్బందిని మోహ‌రించింది. ముందుజాగ్రత్త చర్యగా అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందిని కూడా మోహరించారు.

Also Read..

ఒకే ఇంట్లో ముగ్గురు నీట్ విజేతలు.. ఆద‌ర్శంగా నిలుస్తున్న తోబుట్టువులు

స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్‌తో ఎఫైర్.. భ‌ర్త‌ను పాము కాటుతో చంపేసిన భార్య‌

బ్లాస్ట్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా - గ‌ణిత మేధావి మునిమ‌న‌వ‌రాలు అంటూ ప్ర‌చారం?

Advertisement
Advertisement