త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala | కేర‌ళ పేరు మార్చాల‌ని కేంద్రానికి లేఖ‌.. ఎల్‌డీఎఫ్ ప్ర‌తిపాద‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తు..!

Kerala | కేర‌ళ రాష్ట్రం పేరును మార్చాల‌న్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ ప్రతిపాదనకు బీజేపీ సైతం మ‌ద్ద‌తు తెలిపింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆ పార్టీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాసింది. సీఎం పిన‌రయి విన‌య్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్ర‌భుత్వం కేర‌ళ పేరును కేర‌ళంగా మార్చాల‌ని ప్ర‌తిపాదించింది.

P

National | Published On Jan 13, 2026, 6.18 pm IST

Kerala | కేర‌ళ పేరు మార్చాల‌ని కేంద్రానికి లేఖ‌.. ఎల్‌డీఎఫ్ ప్ర‌తిపాద‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తు..!
Advertisement

Kerala | కేర‌ళ రాష్ట్రం పేరును మార్చాల‌న్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ ప్రతిపాదనకు బీజేపీ సైతం మ‌ద్ద‌తు తెలిపింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆ పార్టీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాసింది. సీఎం పిన‌రయి విన‌య్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్ర‌భుత్వం కేర‌ళ పేరును కేర‌ళంగా మార్చాల‌ని ప్ర‌తిపాదించింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖలు రాసి మద్దతును ప్ర‌క‌టించారు. ఈ లేఖ‌లో రాష్ట్రంలో మతం ఆధారంగా ప్రత్యేక జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్న మతోన్మాద శక్తులను అరికట్టడానికి పేరు మార్పు సహాయపడుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఈ తీర్మానాన్ని ఆమోదించిందని చంద్రశేఖర్ తెలిపారు. బీజేపీ సిద్ధాంతం భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడ‌మేన‌న్నారు. రాష్ట్రానికి వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి ఉంద‌ని.. బీజేపీ ఎప్పుడూ కేర‌ళ‌ను కేరళంగానే చూస్తుందని తెలిపారు.

సీఎకు రాసిన లేఖ‌లో కేర‌ళ సుర‌క్షితంగా, అభివృద్ధి చెంది.. మ‌ల‌యాళీలంతా క‌లిసి క‌లిసిక‌ట్టుగా జీవించాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కేర‌ళ ప్ర‌భుత్వం రాష్ట్రం పేరును కేర‌ళంగా మార్చాల‌ని డిమాండ్ చేస్తూ శాస‌న‌స‌భ‌లో 2024 ఆగ‌స్టులో తీర్మాన్ని ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు పేరును మార్చాలంటూ తీర్మానం కాపీని కేంద్ర ప్ర‌భుత్వానికి పంపింది. వాస్త‌వానికి ఏదైనా రాష్ట్రం పేరును మార్చాలంటే రాజ్యాంబద్దంగా కేంద్ర ప్ర‌భుత్వ ఆమోదం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. రాజ్యాంగంలోనే పేరును మార్చాల్సి ఉంటుంది. అయితే, ‘కేరళం’ అనే పేరు మలయాళమని, రాజ్యాంగంలో రాష్ట్రం పేరు కేరళగా పేర్కొన్న‌ట్లు సీఎం విజ‌య‌న్ తీర్మానం స‌మ‌యంలో తెలిపారు. మలయాళీల ఏకీకృత కేరళ డిమాండ్ జాతీయ స్వాతంత్య్ర పోరాటం నుంచి ఉంద‌న్న ఆయ‌న రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లోని అన్ని భాషల్లోనూ ‘కేరళం’ రాష్ట్రం పేరును మార్చాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, దీన్ని ఈ కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది.

Advertisement

తాజావార్తలు

Advertisement