Mumbai Airport | తప్పిన ప్రమాదం.. ముంబై ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు
Mumbai Airport | మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై విమానాశ్రయంలో (Mumbai Airport) ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో మిమానాల (IndiGo) రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి.
Mumbai Airport | త్రినేత్ర.న్యూస్: మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై విమానాశ్రయంలో (Mumbai Airport) ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో మిమానాల (IndiGo) రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. అయితే రెండు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
మంగళవారం రాత్రి ఎయిర్ ఇడియాకు చెందిన ఏఐ 2732 విమానం తమిళనాడులోని కోయంబత్తూర్‌కు వెళ్లేందుకు పార్కింగ్ బే నుంచి రన్‌వే దిశగా కదులుతున్నది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న ఇండిగో విమానం (6E791) ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయి రన్‌వే నుంచి పార్కింగ్ బే వైపు వెళ్తున్నది. ఈ సమయంలో రెండు విమానాల రెక్కలు పరస్పరం ఢీ కొన్నాయి. దీంతో వాటి రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీజీసీఏ (DGCA) వెల్లడించింది. విమానాలు తనిఖీ కోసం వెళ్తున్న సమయంలో ఇలా జరిగిందని పేర్కొంది. కాగా, పార్కింగ్ చేసిన తర్వాత ప్రయాణికులను సురక్షితంగా దించేసినట్లు ఇండిగో అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు కోయంబత్తూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని మరమ్మతుల కోసం తరలించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
మరోవైపు ఇటీవల విమానాల్లో భద్రతా లోపాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు వచ్చిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో ఇంధన స్విచ్ కటాఫ్ పొజిషన్‌లోకి వెళ్లింది. దీంతో పైలట్లు డీజీసీఏ సిబ్బందికి తెలియజేశారు. ఇలాంటి ఘటన వల్లే అహ్మదాబాద్‌లో ఎయిర్ విమానం కుప్పకూలి 180 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




