త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LK Advani | ఆసుప‌త్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్‌

LK Advani | బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఉప ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ (LK Advani) ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

D

National | Published On Oct 19, 2026, 2.13 pm IST

LK Advani | ఆసుప‌త్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్‌
Advertisement

LK Advani | త్రినేత్ర న్యూస్ : బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఉప ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ (LK Advani) ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయ‌న ఛాతీ ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తుల సమస్యలతో అక్టోబర్ 16న ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరిన విష‌యం తెలిసిందే. మూడు రోజులుగా ఆసుప‌త్రిలోనే చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డ‌టంతో వైద్యులు ఆయ‌న్ని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అద్వానీ వయసు 98 ఏళ్లు. ఆయన గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లుమార్లు ఆసుప‌త్రిలో చేరి చికిత్స త‌ర్వాత డిశ్చార్జ్ అయిన విష‌యం తెలిసిందే.

1927లో క‌రాచీలో (Karachi) జ‌న్మించిన అద్వానీ భారతదేశ‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1986-1990, 1993-98, 2004-05 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అద్వానీ పని చేశారు. బీజేపీని జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా నిలబెట్టడంలో ఆయన కీల‌క పాత్ర పోషించారు. అంతేకాదు, 2002 నుంచి 2004 వ‌ర‌కు అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) ప్రధానిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా, హోం మంత్రిగా (Home Minister) బాధ్యతలు నిర్వర్తించారు. దేశానికి అందించిన సేవలకు గాను అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది.

Also Read..

నోబెల్ గ్ర‌హీత న‌వీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు

దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను తమ అల్లుడిగా చేసుకున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శ‌లు

పోలీసుల జోక్యం మీద రాస్తే జ‌ర్న‌లిస్టుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తరా?

Advertisement
Advertisement