త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | త‌ప్పుడు కంటెంట్‌పై కొర‌డా.. మెటాకు కేంద్రం కీల‌క ఆదేశాలు

Meta | ఫేస్‌బుక్ మాతృసంస్థ‌ మెటా (Meta)కు కేంద్రం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. యూజర్లకు ఒకే రకమైన లేదా పరిమిత సంఖ్యలో ఉన్న కథనాలను మాత్రమే పదే పదే చూపించకుండా (Disproportionate exposure) అల్గారిథమ్‌లను (algorithms) మార్చాల‌ని ఆదేశించింది.

D

National | Published On Oct 19, 2026, 2.56 pm IST

Meta | త‌ప్పుడు కంటెంట్‌పై కొర‌డా.. మెటాకు కేంద్రం కీల‌క ఆదేశాలు
Advertisement

Meta | సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌ కంటెంట్ వ్యాప్తి క‌ట్ట‌డికి కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్ మాతృసంస్థ‌ మెటా (Meta)కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. యూజర్లకు ఒకే రకమైన లేదా పరిమిత సంఖ్యలో ఉన్న కథనాలను మాత్రమే పదే పదే చూపించకుండా (Disproportionate exposure) అల్గారిథమ్‌లను (algorithms) మార్చాల‌ని ఆదేశించింది. ప్రజలకు విభిన్నమైన, వారికి అవసరమైన, విశ్వసనీయమైన సమాచారం అందేలా చూడాలని కోరింది.

శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం కలిగించే, హింసను ప్రేరేపించే, అసాధారణ కార్యకలాపాలకు దారితీసే కంటెంట్‌పై నిఘా పెంచాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన నేపథ్య సమాచారం లేకుండా ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేయడం లేదా కొన్ని అంశాలకు అసాధారణ ప్రాధాన్యం కల్పించడం వల్ల ప్రజల్లో గందరగోళం, ఆందోళన పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

అందుకే సున్నిత‌మైన‌ కంటెంట్, విజువ‌ల్స్ యూజ‌ర్ల‌కు చేరేట‌ప్పుడు అది ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగింద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌జేసేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి తెలిపింది. హింసను ప్రేరేపించే లేదా అల్లర్లకు దారితీసే కంటెంట్‌ను త్వరిత‌గ‌తిన గుర్తించి, ఐటీ నిబంధ‌ల‌న‌ల‌కు లోబడి తక్షణమే తొలగించేందుకు వీలుగా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సూచించింది. ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ అంశంపై చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ, విప‌క్షాలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టిన నేప‌థ్యంలో మెటాకు కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read..

ఆసుప‌త్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్‌

నోబెల్ గ్ర‌హీత న‌వీ పిళ్లెని అభినందించరా..? కేంద్రంపై శశిథరూర్ విమర్శలు

టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్

Advertisement
Advertisement