త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | కొత్త లుక్‌లో శోభిత ధూళిపాళ్ల‌

Sobhita Dhulipala | సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు.

S

Movies | Published On Nov 9, 2026, 6.16 pm IST

Sobhita Dhulipala | కొత్త లుక్‌లో శోభిత ధూళిపాళ్ల‌
Advertisement

Sobhita Dhulipala | సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న "వేట్టువం" సినిమా వచ్చే సంక్రాంతి పండక్కి వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమ‌వారం "వేట్టువం" సినిమా నుంచి మేకర్స్ 'సెలబ్రేట్ రెసిలియన్స్..' వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ తమ సహనాన్ని పరీక్షించే సందర్భం వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడ్డాయో, తమ శక్తిని ఎలా ప్రదర్శించాయో చూపించడం ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది.

Advertisement
Advertisement