Chiranjeevi | నా బలం నువ్వే.. భార్యపై ప్రేమను చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidela) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన అర్ధాంగికి మెగాస్టార్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidela) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన అర్ధాంగికి మెగాస్టార్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నువ్వే నా బలం అంటూ భార్యపై తనకున్న ప్రేమను వెల్లడించారు. ఈ మేరకు నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు.
"నా సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. 1980 ఫిబ్రవరి 20న మన పెళ్లి జరిగిన నాటి నుంచి నువ్వే నా బలంగా మారావు. ఈ రోజు నీ పుట్టినరోజుతోపాటూ రెండు రోజుల ముందే మన పెళ్లి రోజునుకూడా జరుపుకోవడం సంతోషంగా ఉంది. కుటుంబానికి మెయిన్ పిల్లర్ నువ్వు. నీ ప్రేమ, ఆప్యాయతతో కుటుంబం మొత్తాన్ని ఒకతాటిపై ముందుకు నడిపిస్తున్నావు. మా అమ్మను సొంత బిడ్డలా చూసుకుంటున్నావు. నా ప్రతి విజయం వెనుకా ఉన్నది నువ్వే. కుటుంబం బాధ్యతను నీ భుజాన వేసుకున్నావు కాబట్టే నేను సినిమాల్లో రాణిస్తున్నాను. నీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను" అంటూ చిరు తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, మెగా అభిమానులు సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
https://x.com/KChiruTweets/status/2024020844427833694
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



