త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

World’s Most Expensive Tea | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ.. కిలో ధర రూ.9 కోట్లు.. దీన్ని చైనా ఎందుకు బ్యాన్ చేసిందంటే?

కేవలం 20 గ్రాముల టీ పొడి ధర అక్షరాలా లక్ష రూపాయలంటే నమ్ముతారా? బంగారానికంటే 30 రెట్లు ఖరీదైన ఈ టీ ఆకులను చైనా ఎందుకు బ్యాన్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

J

Food | Published On Jul 22, 2026, 11.00 pm IST

World’s Most Expensive Tea | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ.. కిలో ధర రూ.9 కోట్లు.. దీన్ని చైనా ఎందుకు బ్యాన్ చేసిందంటే?
Advertisement
  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'డా హాంగ్ పావో' టీ కిలో ధర సుమారు రూ.9 కోట్లు
  • చైనాలోని వుయీ పర్వతాల్లో కేవలం 6 మదర్ ట్రీస్ (Mother Trees) మాత్రమే ఈ ఒరిజినల్ టీ ఆకులను అందిస్తాయి
  • వీటి చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా చైనా ప్రభుత్వం 2006లో వీటి కమర్షియల్ హార్వెస్టింగ్‌ను బ్యాన్ చేసింది
  • ప్రస్తుతం మార్కెట్లో దొరికేది ఈ ఒరిజినల్ చెట్ల క్లోన్స్ నుంచి సేకరించిన టీ పొడి మాత్రమే

World's Most Expensive Tea | త్రినేత్ర.న్యూస్ : చైనాలోని (China) ఫుజియాన్ ప్రావిన్స్‌లో పండే 'డా హాంగ్ పావో' (Da Hong Pao) టీ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. సాధారణంగా మనం ఇంట్లో వాడే టీ పొడి కిలో వందల్లో ఉంటుంది. కానీ ఈ టీ పొడి 20 గ్రాములు కొనాలంటే ఏకంగా లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిందే! కిలో ధర ఏకంగా రూ.9 కోట్లు పలుకుతున్న ఈ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ టీ కి ఉన్న ప్రత్యేకతలు, చైనా ప్రభుత్వం దీన్ని ఎందుకు బ్యాన్ చేసిందనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

అసలేంటి ఈ 'డా హాంగ్ పావో'?

మాండరిన్ భాషలో 'డా హాంగ్ పావో' అంటే పెద్ద ఎర్రటి వస్త్రం (Big Red Robe) అని అర్థం. చైనాలోని యునెస్కో (UNESCO) వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన వుయీ (Wuyi) పర్వతాల్లో మాత్రమే ఈ అరుదైన ఊలాంగ్ (oolong) టీ పండుతుంది. గ్రీన్ టీలోని ఫ్రెష్‌నెస్, బ్లాక్ టీలోని రిచ్‌నెస్ కలగలిపి ఉండే ఈ టీ.. పూల సువాసనలతో (floral aromas) తాగడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి సిప్ చివర్లో సహజమైన తీపి రుచి తగలడం ఈ టీ స్పెషాలిటీ.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ ఎందుకైంది?

వుయీ పర్వతాల్లోని కొండచరియల్లో కేవలం ఆరు ఒరిజినల్ 'డా హాంగ్ పావో' చెట్లు మాత్రమే ఉన్నాయి. వీటిని మదర్ ట్రీస్ (Mother Trees) అని పిలుస్తారు. వందల ఏళ్ల నాటి ఈ చెట్ల నుంచి వచ్చే టీ ఆకుల ఉత్పత్తి చాలా పరిమితం. అందుకే ఆ ఆకులకు అంత డిమాండ్. వేలంలో (auction) 20 గ్రాముల ఒరిజినల్ టీ ఆకులు సుమారు రూ. 1.23 లక్షలకు అమ్ముడుపోయాయి. బరువును బట్టి చూస్తే ఇది బంగారానికంటే 30 రెట్లు ఎక్కువ విలువైనది.

బ్యాన్ ఎందుకు చేశారు?

ఈ ఆరు మదర్ ట్రీస్ కు ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని చైనా ప్రభుత్వం 2006లో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాల కోసం ఆ చెట్ల నుంచి కమర్షియల్ హార్వెస్టింగ్ (ఆకులు తెంచడం) శాశ్వతంగా బ్యాన్ చేసింది. అంతేకాకుండా వాటికి ఏకంగా రూ.142 కోట్ల (100 million RMB) ఇన్సూరెన్స్ కూడా చేయించింది. అప్పట్లో సేకరించిన చివరి టీ ఆకులను బీజింగ్‌లోని ప్యాలెస్ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రస్తుతం మనం కొంటున్న 'డా హాంగ్ పావో' టీ.. ఆ ఒరిజినల్ చెట్ల క్లోన్స్ (clones) నుంచి తయారు చేసినవే తప్ప ఒరిజినల్ కావు.

ఆ పేరు వెనక ఉన్న ఆసక్తికరమైన కథ

చైనా పురాణాల ప్రకారం.. వందల ఏళ్ల క్రితం ఒక యువకుడు పరీక్షలు రాయడానికి బీజింగ్ వెళ్తూ మార్గమధ్యలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు ఒక సన్యాసి ఈ కొండల మీద పండే టీ ఆకులతో పానీయం చేసి ఇవ్వగా.. అతడు వెంటనే కోలుకున్నాడు. ఆ తర్వాత ఆ పరీక్షల్లో టాపర్‌గా నిలిచాడు. కొన్నాళ్లకు అక్కడి చక్రవర్తికి ఆరోగ్యం క్షీణించగా.. ఆ యువకుడు ఇదే టీతో నయం చేశాడు. దీనికి బహుమతిగా చక్రవర్తి ఒక పెద్ద ఎర్రటి వస్త్రాన్ని (red ceremonial robe) బహుకరించాడు. ఈ ఆకులకు కృతజ్ఞతగా ఆ యువకుడు ఆ వస్త్రాన్ని ఆ చెట్లపై కప్పాడు. అప్పటినుంచే దీనికి 'డా హాంగ్ పావో' అనే పేరొచ్చింది.

దీన్ని ఎలా తయారు చేస్తారు?

ఈ టీ ని వేడినీటిలో (95-100°C) మరగబెట్టి.. స్లో గా ఆస్వాదించాలి. సాధారణ టీ బ్యాగ్స్ లాగా ఒకసారి వాడి పారేయకుండా, ఈ ఆకులను మూడు, నాలుగు సార్లు వేడి నీటిలో మరిగించి తాగొచ్చు. ప్రతిసారీ దీని రుచి, సువాసన మరింత అద్భుతంగా మారుతుందని టీ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. బ్యాన్ కారణంగా ఒరిజినల్ టీ రుచి చూసే అవకాశం భవిష్యత్తులో ఎవరికీ దక్కకపోయినా.. ఈ అరుదైన టీ ఘనత మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

Advertisement
Advertisement